Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కార్తీక మాస పురాణం కథలు అద్భుతమైన కథ 11వ రోజు పారాయణం 11 వ అధ్యాయం

 కార్తీక మాస పురాణం కథలు 

11వ రోజు పారాయణం 

11 వ అధ్యాయం


వశిష్ట ఉవాచ ::

రాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిస పూలతో పూజిస్తారో వాళ్లకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది.

 గరికతో కుశలతోనూ పూజించేవాళ్లు పాప విముక్తులే వైకుంఠం పొందుతారు .

చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షం పొందుతారు కార్తీక స్నానం ఆచరించి విష్ణు సన్నిధిలో దీప మాలికలు ఉంచేవాళ్లు పురాణ పాఠకులు కూడా శ్రోతలు కూడా విగత పాపులే పరమపదాన్ని చేరుతారు .

ఎందుకు ఉదాహరణగా వినినంత చేతనే సర్వపాపాలను నశింప చేసేది ఆయురారోగ్య ప్రదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను .. 

మందరో పాఖ్యానం :: 

కలింగదేశీయుడు అయిన మందరుడు అనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్య వందనాలు అన్నిటినీ వదిలేసి పరులకు కూలి పనులు చేస్తూ ఉండేవాడు.

 అతనికి పతివ్రత సర్వసాముద్రిక శుభలక్షణ సంపన్నురాలు సద్గుణంతో ఉండడం చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైన కూడా అతని పట్ల రాగమే తప్ప ద్వేషం లేనిదై  పతివ్రత నిష్టాపరురాలు అయి ఉండేది..

 కొన్నాళ్ల తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు అరణ్యంలో ఉంటూ ఖడ్గం చేతపట్టి దారులు కాసి బాటసారిలను కొట్టి వారి నుండి 

ధనం అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగ సొత్తు ఇరుగుపొరుగు దేశాలకు తీసుకొని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబం చేసేవాడు ఒకసారి దొంగతనం కోసం దారి కాసి ఒక మంద దారి కాసి 

ఉన్న మందరుడు బాటసారి అయినా ఒక బ్రాహ్మణుడిని పట్టుకొని అక్కడి మర్రిచెట్టుకు కట్టివేసి ఆ బ్రాహ్మణుడి డబ్బులు అన్ని అపహరించాడు .

ఇంతలోనే అటుగా వచ్చిన పరమ క్రూడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మందరుడిని దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దరినీ కూడా చంపేసి ఆ ద్రవ్యాన్ని తాను అపహరించుకొని వెళ్ళిపోయాడు.

 కానీ అదే సమయానికి అక్కడి కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన దగ్గరలో గుహలో ఉన్న పెద్ద పులికాండ్రుమంటూ వచ్చి కిరాతకుడు పై పడింది పులి తన పంజాతోను కిరాతకుడు ఖడ్గంతోను ఒకరినొకరు కొట్టుకున్నారు .

ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలోనే మరణించారు ఈ విధంగా మరణించిన బ్రాహ్మణ మందర పులి కిరాతకుల జీవులు నలుగురు యమలోకం చేరి కాలసూత్రం అనే నరకాన్ని పొందారులు .

ఆ నలుగురిని పురుగులు అమేధ్యముతో నిండి ఉన్న రక్త కోపంలో పడవేశారు ఇక భూలోకంలో భర్త మరణ వార్త తెలియని అందరూ

 నీ భార్య ఆయన సుశీల మాత్రం నిత్యం భర్త ధ్యానం చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యాలతో జీవించ సాగింది..

ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు అందరిలోనూ భగవంతుని దర్శించిన వాడు నిత్యానంద నర్తకు అయిన ఒకానొక యతీశ్వరుడు

 ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధ భక్తులతో అతనికి బిక్ష వేసి అయ్యా నా భర్త కార్యార్థమై వెళ్లి ఉన్నాడు ఇంట్లో లేడు నేను ఏకాకిని ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించుకుంది .

అందుకు ఆయీశ్వరుడు అమ్మాయి ఆవేదన పడకు ఈరోజు కార్తీక పౌర్ణమి మహా పర్వదినం ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పట్టణం శ్రవణం మొదలైన ఏర్పాటు చెయ్యి అందుకుగాను...

 ఒక దీపం చాలా అవసరం దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు ఒత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు ..

ఆ యతి శ్రేష్టుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా పరిశుభ్రం చేసి రెండు వత్తులను చేసి యతీశ్వరుని దగ్గర నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది.

యతి ఆదీప సహితంగా విష్ణువును పూజించి మన శుద్ధి కోసం పురాణ పఠనం ఆరంభించాడు సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్లి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది ..

అందరి నడుమ తాను కూడా ఏకాగ్రత చెప్తాయి ఆ పురాణాన్ని వింధ్యా అనంతరం ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు..

 నిరంతర హరిసేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి తర్వాత కాల ధర్మం చెందింది.

తక్షణమే శంకు చక్రాలు కలిగిన చతుర్బాహులు, పద్మాక్షులు, పీతాంబర దరులు అయిన విష్ణు దూతలు నందనవన సుందర మందారాది

 సుమాలతోనూ రత్న మౌక్తిక ప్రవలాధులతోనూ నిర్మించిన మాలికాంబర ఆభరణాలు అలంకరించుకొని ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని వెళ్లసాగారు.

అలా వైకుంఠ కి వెళుతున్న సుశీల మార్గమధ్యంలోని నరకంలో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి

 విమానాన్ని ఆపించి దానికి కారణం ఏమిటో తెలుపవలసిందిగా విష్ణు దూతలను కోరింది అందుకు వారు అమ్మ నీ భర్త అయినా ఆ మందరుడు బ్రాహ్మణ కులంలో జన్మించిన కూడా వేద ఆచారాలను వదిలేసి కూలీ అయ్యి మరి కొన్నాళ్లు దొంగయి 

దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రదోహి మిత్రుడు ఒకడిని చంపి అతడి ధనంతో పరదేశాలకు

 పారిపోయి వెళ్తూ నీ భర్త చేత బంధితులు అయ్యాడు అతగాడి పాపానికి గాను ఇతను నరకం చేరవలసి వచ్చింది. ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి అంతకు పూర్వ జన్మలో ద్రావిడ బ్రాహ్మణుడు అయ్యుండి ద్వాదశి రోజున భక్షాభక్ష విచక్షణ లేకుండా 

ఆచరించిన తైలంతో చేసిన భోజనం తినడం వల్ల నరకం పొంది పులిగా పుట్టి ఈ కిరాతకునితో దెబ్బలాటలో అతనితో పాటే నరకాన్ని చేరింది ఈ నలుగురి నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు.

ఆ తరువాత సుశీల విష్ణు దూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పమని కోరగా వైష్ణవులు కార్తీక మాసంలో

 నీ చేత ఆచరించబడిన పురాణ శ్రమ ఫలితాన్ని ధారపోయడం వల్ల నీ భర్త పురాణ శ్రమార్దమై నువ్వు ఇంటికి వెళ్లి ప్రజలను పిలిచినా పుణ్యం ధారపోయడం వలన మిత్రదోహి అయినా బ్రాహ్మణుడు

 ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని చెరి సగం దారపోయడం వల్ల కిరాత అలాగే పులి నరకం నుండి ముక్తిని పొందుతారు అని పలికారు .

ఇలా వాళ్ళు చెప్పిందే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారి వారికి ధారపోయడంతో ఆ నలుగురు నరకం నుండి ఇది 30 దివ్య విమానాలు వివిధ విధాలుగా ప్రసాదిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకో పోబడ్డారు.

కాబట్టి ఓ జనకమహారాజా కార్తీకమాసంలో చేసే పురాణ శ్రవణం వల్ల హరిలోకం తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో..

 పదవ అధ్యాయం సమాప్తం

పదవరోజు పారాయణం సమాప్తం

*******









This post first appeared on My, please read the originial post: here

Share the post

కార్తీక మాస పురాణం కథలు అద్భుతమైన కథ 11వ రోజు పారాయణం 11 వ అధ్యాయం

×

Subscribe to My

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×