Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మీ స్పందనకు ధన్యవాదములండీ



ఇవి నావే, ఐనా చాలా వరకు ఆలోచన పరమైన మరియు ఆచరణ పరమైన సంగతులు...


మీ స్పందనకు ధన్యవాదములండీ...


స్నేహాంజలి. 

నా మొదటి కథ - పేద బ్రతుకులు - 31-1-1975 ప్రగతి వార పత్రికలో ప్రచురింపబడింది. అది లగాయితు ... నేను ఎన్నెన్నో రచనలు రాశాను, రాస్తున్నాను. ఆ నా రచనలు వివిధ రూపాల్లో మీ చెంతకు చేరుస్తున్నాను. వాటిని మీరు చూస్తున్నారు, చదువుతున్నారు. సంతోషం. ఈ సమయాన నాకు తెలిసిన, ఎఱికైన వాటి మీద మీకు తప్పనిసరిగా వివరణ ఇవ్వాలి. కనుక అవి ఇవి ...
  • నా ప్రతి రచన ముందు నేను రెండు విషయాలు తప్పక ఆలోచిస్తాను. ఒకటి, ఈ నా రచన ఆలోచింప చేయాలి. రెండు, ఈ నా రచన హాని చేయకూడదు.
  • నా రచన సందేశం ఇవ్వనక్కరలేదు కానీ నా రచన సందేహం కారాదన్నది నా తపన కూడా.
  • రచన ఇలా ఉండాలి లేదా రచనకి ఇవి ఉండాలి అన్నవి ఏమైనా ఉంటే అట్టి వాటికై ప్రాకులాడ కూడదని తలిచి ఉన్న వాడిని నేను.
  • చెప్పతలిచింది మితంగా నా రీతిన చదివించేలా మాత్రమే రాయాలన్నది నా ఒరవడి.
  • నా ప్రతి రచనకి నేను రచయితనే కాదు మొదటి పాఠకుడుని కూడా. అందుకే ఒక పాఠకుడులా ఈ రచన నచ్చిందా లేదా ఈ రచన నచ్చలేదా అన్న ప్రశ్న వేసుకుంటాను. అలాగే నచ్చితే ఎందుకు, నచ్చక పోతే ఎందుకు అని కూడా బేరేజీ వేసుకుంటాను. ఒక రచయిత గానే కాదు ఒక పాఠకుడులా కూడా వ్యవహరించి, తుదికి నచ్చింది అని తేలితేనే ఆ రచన ప్రచురణకై యత్నిస్తాను.
  • అలా నాచే నిగ్గుతేలిన ఆ నా రచన ప్రచురణ కాబడిన తర్వాత, దానికై స్పందించిన ప్రతి వారికీ ధన్యవాదములు వినయంగా తెలియచేస్తాను. ఎంచేతంటే ఆ నా రచనని వారు చదివారు కనుక. ఈ వివరణ తర్వాత ఇకపై నా ప్రతిస్పందనలు అక్కరకు రావని నేను తలుస్తున్నాను.
  • ప్రచురణ కాబడిన నా రచనని ఒకరు నచ్చింది అంటారు, దానినే మరొకరు నచ్చలేదు అంటారు. అంటే ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చు, అలాగే ఒకరికి నచ్చంది మరొకరికి నచ్చవచ్చు. కనుక ఇవన్నీ వారి వారి అభిరుచులు అన్నవి నా తలంపు. అంచేతనే వీటిలో ఏవీ నన్ను ప్రభావితం చేయవు.
  • ప్రచురణ ఐన నా రచనలో ఈ మాట లేదా ఈ వాక్యం లేదా ఈ వర్ణన ఇలా ఉండాలి అంటే నాలోని రచయిత మరియు నాలోని పాఠకుడు అస్సలు స్వీకరించరు. కారణం నా రచనలో చోటు చేసుకున్న ప్రతి అక్షరం తొలుత వారి వారి తర్కాలతో సాన పెట్టబడిందే. పైగా రచనలో సారం ఆశించడం సబబు కానీ సాగుబడిని దున్నాలనుకోవడం భావ్యమా. మరీ చోద్యం కాకపోతేను.
  • నా రచన చెడకొట్టింది లేదా నా రచన రెచ్చకొట్టింది లేదా నా రచన దిగజార్చింది అని సక్రమంలో నిరూపించగలిగితే నేను వ్యక్తిగా ఎట్టి శిక్షకైనా నిలుస్తాను. అలాగే ఆ నా రచనతోనే నాలో రచయిత మరియు నాలో పాఠకుడు ఎట్టి విన్నపం లేదా వివరణ చేపట్టకనే  స్వచ్ఛందంగా రచనా విరమణ చేసి తీరుతారు.
ఈ నా వివరణ అంశాలు మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు లేదా అనిపించకపోవచ్చు. కానీ నేను చెప్పతలచుకుంది మీకు తెలియచేశాను. అలాగే సదా నాలో రచయిత మరియు నాలో పాఠకుడు ఈ విధంగానే సాగుతాడని, కొనసాగుతాడని నేను ఒక వ్యక్తిగా ఆశిస్తున్నాను ... అకాంక్షిస్తున్నాను ... అంతే.  
***

నా కబురులు అన్నింటికై ఇక్కడ క్లిక్/టచ్ చేయండి

***



నా రీతుల్లో, నా తీరుల్లో,  నా శైలిల్లో, మీ దరిన నేను పెడుతున్న నా వివిధ తెలుగు రాతలు ...


నా రచనలు అన్నింటికై  ఇక్కడ క్లిక్/టచ్ చేయండి

***



నన్ను ఆకట్టుకున్న మరియు  ఆలోచింపజేసిన, చాలా వరకు ఉపయుక్తమైన విషయాలు ...

నా ముచ్చటలు అన్నింటికై ఇక్కడ క్లిక్/టచ్ చేయండి.

***
                     
రేపటి టపా*
***
* ఆదివారం విరామం

Share the post

మీ స్పందనకు ధన్యవాదములండీ

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×