Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Telangana Group-3 Revised Vacancies

Telangana Group-3 Revised Vacancies announced by TSPSC .. This is the direct link

TSPSC Group 3 : తెలంగాణ గ్రూప్‌-3 రివైజ్డ్‌ ఖాళీలను వెల్లడించిన TSPSC .. డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

TSPSC Group 3 Updates 2024 : తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు సంబంధించి TSPSC కీలక ప్రకటన చేసింది. TSPSC Group 3 ఉద్యోగాల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు TSPSC కమిషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే గ్రూప్‌-3 నోటిఫికేషన్‌లో రివైజ్డ్‌ ఖాళీల వివరాలను మే 3వ తేదీన వెల్లడించింది. https://websitenew.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో రివైజ్డ్‌ ఖాళీల వివరాలను తెలుసుకోవచ్చు. ఈ వివరాలను తెలుసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,388 గ్రూప్‌-3 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ 30న TSPSC నోటిఫికేషన్‌ విడుదల చేసింది. TSPSC Group-3 పోస్టుల భర్తీకి ఈ ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు.

మొత్తం 1,388 గ్రూప్-3 పోస్టులకుగాను 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 390 మందిగా పోటీ పడుతున్నారు. TSPSC Group 3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. TSPSC Group-3 ఎగ్జామ్ మొత్తం 450 మార్కులకు ఉంటుంది. మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఇందులో మెరిట్ ఉన్నవారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో భాగంగా మొదట 1363 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత.. పలు శాఖల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రాగా.. కొత్తగా మరిన్ని పోస్టులు జమ అయ్యాయి దీంతో ఈ సంఖ్య 1388కి చేరింది. ఈ మొత్తం ఖాళీల్లో అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు-680 కాగా.. సీనియర్ అకౌంటెంట్ పోస్టులు 436 ఖాళీలున్నాయి.

Important Links:

FOR  TOTAL VACANCIES CLICKHERE.

FOR  WEBSITE  CLICKHERE.



This post first appeared on APTEACHERS9, please read the originial post: here

Share the post

Telangana Group-3 Revised Vacancies

×

Subscribe to Apteachers9

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×