Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Snake and Mungoose

Tags: mungoose snake

 Snake and Mungoose: Why snake venom does not work on mongoose.. This is the reason

Snake and Mungoose: ముంగిసపై పాము విషం ఎందుకు పనిచేయదు.. కారణం ఇదే.

Snake and  Mungoose: పాము ఎంతటి ప్రాణి అంటే దాని గురించి వింటేనే మనిషి వణికిపోతాడు. మీ కళ్ల ముందు పాము వస్తే కొన్ని సెకన్ల పాటు ఏమీ అర్థం కాదు. పాము కాటు తర్వాత అక్కడికక్కడే చికిత్స అందించకపోతే మరణం దాదాపుగా ఖాయం. ఇదిలా వుండగా పాముకి శత్రువుగా భావించే ముంగిస మాత్రం ఎలా బతుకుతుందనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. పెద్ద జంతువులు కూడా పాము విషానికి తట్టుకోలేవు. 

కానీ ముంగిస మాత్రం బతుకుతుంది. పాము వర్సెస్‌ ముంగిసగా పోరాటం జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ముంగిసలే పెద్ద పెద్ద పాములను చంపుతాయి. పాములు ముంగిస పిల్లలను తింటాయి. కానీ పెద్ద ముంగిసల విషయానికి వస్తే అవి పామునే చంపేస్తాయి. నిజానికి ముంగీసల శరీరంలో ఎసిటైల్‌కోలిన్ ఉంటుంది. ఇది వాటి మెదడులో ఉండే న్యూరోట్రాన్స్మిటర్. ఇది రక్తంలో కలిసిన విషం న్యూరోటాక్సిక్ ప్రభావాలను తగ్గిస్తుంది. దీని వల్ల పాము విషం వల్ల ముంగిసలు చనిపోవు. విషానికి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. కొన్ని సార్లు పాములు కూడా ముంగిసల కంటే ఎక్కువ విషాన్ని కలిగి ఉంటాయి.

ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ముంగిస, పాము మధ్య శత్రుత్వం సహజంగా ఉంటుంది. పాములు ముంగిసకు ఆహారం మాత్రమే. ఆహారం కోసం మాత్రమే పాములను వేటాడతాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముంగీస ఎక్కువగా దాడి చేయదు. అవి తమను లేదా తమ పిల్లలను పాము దాడి నుండి రక్షించుకోవడానికి మాత్రమే దాడి చేస్తాయి. ఇండియన్ గ్రే ముంగీస అనేది అత్యంత ప్రమాదకరమైన పాము కిల్లర్‌గా పిలుస్తారు. ఇది కింగ్ కోబ్రాను కూడా చంపగలదని నిపుణులుద అంటున్నారు.



This post first appeared on APTEACHERS9, please read the originial post: here

Share the post

Snake and Mungoose

×

Subscribe to Apteachers9

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×