Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Central new regulations on power pole, transformers in agricultural land

 Central Govt: Central new regulations on power pole transformers in agricultural land. Benefit for such people!

Central Govt : వ్యవసాయ భూమిలో విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ ఫారం లపై కేంద్రం కొత్త నిబంధనలు. అలాంటి వారికి లబ్ధి.!

Central Govt : వ్యవసాయ భూములపై విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్ ఫారంలను ఏర్పాటు చేయడం వలన రైతులు వారి వ్యవసాయ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని ఆరోపణలు చేస్తుంటారు .

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అటువంటి మౌలిక సదుపాయాలను కలిగి ఉన్న భూ యజమానులకు వివిధ రకాల ప్రయోజనాలు అందించనున్నారు.అయితే విద్యుత్ చట్టం ప్రకారం రైతులు వారి యొక్క వ్యవసాయ భూమిలో ఎలక్ట్రిక్ స్తంభాలను ఏర్పాటు చేసినట్లయితే మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు అర్హులవుతారు. ఇక ఈ ప్రయోజనాలను పొందేందుకు రైతులు తప్పనిసరిగా రాతపూర్వకంగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను సమర్పించిన 30 రోజుల తర్వాత ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోల్ రకం మరియు దాని శక్తిసామర్థ్యాల ఆధారంగా మీకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.

Central Govt : ఆర్థిక సహాయం…

అయితే భూమిలో విద్యుత్ స్తంభాలను కలిగి ఉన్న రైతులు వారానికి 100 రూపాయలు పరిహారంగా పొందుతారు. అలాగే ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫారం లో ఏదైనా లోపం ఉన్నట్లయితే మరమత్తు ప్రక్రియను 48 గంటల్లోనే పూర్తి చేయాలి. అంతకుమించి ఆలస్యం జరిగినట్లయితే రైతులకు చట్టం కింద 50 రూపాయల వరకు పరిహారం అందుతుంది.

Central Govt : విద్యుత్ ప్రయోజనాలు

రైతులకు DP మరియు PL తో పాటు 2000 నుండి 5000 యూనిట్ల వరకు విద్యుత్ ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. అలాగే విద్యుత్ సంస్థకు నిరాక్షేపణ సర్టిఫికెట్ జారీ చేసినట్లయితే కంపెనీ మరియు రైతుల మధ్య లీజ్ ఒప్పందం కూడా ఏర్పడడం జరుగుతుంది. ఇక ఈ ఒప్పందం ద్వారా రైతులు 2000 నుండి 5000 వరకు ఆర్థిక సాయం పొందవచ్చు.

Central Govt : విద్యుత్ కనెక్షన్…

ఇంటి అవసరాలకు లేదా వ్యవసాయ అవసరాల కోసం కొత్త ఎలక్ట్రిక్ కనెక్షన్ కోరుకునే వారికి కంపెనీ నిర్వాహకులు ఉచితంగానే కనెక్షన్ ఇస్తారు. అయితే నిజానికి కొత్త కనెక్షన్ తీసుకోవడానికి 1500 నుండి 5000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ వారి ఆస్తులపై విద్యుత్ స్తంభాలను కలిగి ఉన్న యజమానులు సకాలంలో చర్యలు తీసుకోవడం వలన ఇలాంటి ప్రయోజనాలు పొందవచ్చు.అయితే మొదట్లో వ్యవసాయ విద్యుత్ స్తంభాలు ఉండటం వలన రైతుల నుండి తీవ్రమైన ఆందోళనలు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొత్త నిబంధనలు, రైతులకు ఆర్థిక నష్టపరిహారం మరియు వివిధ ప్రయోజనాలను అందించడం ద్వారా ఇలాంటి ఆందోళనలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించిన పథకాల కోసం రైతులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రయోజనాలను పొందుతూ వారి యొక్క వ్యవసాయ కార్యకలాపాలతో విద్యుత్ మౌలిక సదుపాయాలను కూడా పొందవచ్చు.



This post first appeared on APTEACHERS9, please read the originial post: here

Share the post

Central new regulations on power pole, transformers in agricultural land

×

Subscribe to Apteachers9

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×