Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

How To Change Address On Voter Id Card

  How To Change Address On Voter Id Card

Voter ID Card : మీ ఓటర్ ఐడీలో అడ్రస్‌ మార్చుకోవాలా..? ఆన్‌లైన్‌లో ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయితే చాలు..

Election Commission of India : మీ ఓటర్ ఐడీ కార్డుపై అడ్రస్ మార్చాలనుకుంటున్నారా..? ఒక అడ్రస్ నుంచి మరో అడ్రస్‌కు మారారా..? సులువుగా ఓటర్ ఐడీ కార్డుపై అడ్రస్ మార్చొచ్చు.

How to Change Address on Voter ID Card : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే తుది ఓటరు జాబితాలను విడుదల చేసింది. అయితే.. ఒకవేళ ఓటరు ఐడీలో పాత అడ్రస్ ఉండిపోయినా.. దాన్ని ఇప్పటికీ మార్చుకోవచ్చు.

మొదట ఫారం-8ని నింపాలి :

మొదట ఆన్ లైన్ లోకి వెళ్లి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (NVSP) వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. దానిలో కనిపించే ఫారం 8 ద్వారానే ఓటర్లు తమ ఐడీల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి అడ్రస్‌, ప్రస్తుతం కార్డుపై వివరాల్లో మార్పులు, కొత్త ఓటర్ ఐడీ కార్డు కావాలన్నా ఇదే ఫారం సమర్పించాలి.

అందుకోసం https://voters.eci.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. ఒకవేళ మీరు అకౌంట్ లేకపోతే సైన్ అప్ చేసుకోవాలి. మీ ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, క్యాప్చాను ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లాగిన్ కావాలి.

హోమ్ స్క్రీన్ మెనూలో నుంచి ఫారం-8పై క్లిక్ చేయాలి. ‘షిఫ్టింగ్ ఆర్ రెసిడెన్స్/కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రోరల్ రోల్/రిప్లేస్ మెంట్ ఆఫ్ ఈపీఐసీ/ మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడీ’ అని రాసి ఉండటంతో దానిపై ఫారం 8 అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

గమనిక : ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మీ ఓటు మార్చేందుకు, ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్ మార్చేందుకు Form 6 ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఒకే నియోజకవర్గంలో వేరే ప్రాంతానికి మారినట్లయితే Form 8A పైన క్లిక్ చేయాలి.

అనంతరం మరో పేజీలో.. ఆ దరఖాస్తు ఎవరికోసం అని అడుగుతుంది. ‘సెల్ఫ్’ , ‘అదర్ ఎలక్టర్’ ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అప్లికేషన్ మీ కోసమే అయితే సెల్ప్ అని, వేరొకరి అయితే అదర్ ఎలక్టర్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి.

ఆ తర్వాత ఓటరు ఐడీ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అప్పుడు మీరు దానిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు మరో డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. దానిలో మీరు పేరు ఇతర వివరాలు కనిపిస్తాయి. అవన్నీ మీవే అని నిర్ధారించడానికి ఓకే బటన్ పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత ఓపెన్ అయిన స్క్రీన్ పై షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం పరధిలోన లేక బయట నివాసం ఉంటున్నారా అని అడుగుతుంది. మీ నివాస స్థానాన్ని బట్టి దీన్ని ఎంచుకోవచ్చు.

అప్పుడు మీకు ఫారం 8 కనిస్తుంది. దానిలో మూడు పార్టులు ఉంటాయి. సెక్షన్ ఏ లో రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ/పార్లమెంట్ నియోజకవర్గం ఎంచుకోవాల్సి ఉంటుంది.

సెక్షన్ బీలో వ్యక్తిగత వివరాలు అంటే పేరు వంటివి పూర్తి చేయాలి. సెక్షన్ సీలో మీరు మార్చుకోవాలనుకుంటున్న చిరునామాను పూరించి, దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ డీలో డిక్లరేషన్ ఉంటుంది. సెక్షన్ ఈలో రివ్యూ, సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది.

అయితే మీరు మార్చుతున్న చిరునామాను తగ్గినట్లుగా ఓ ఐడీ ప్రూఫ్‌ సమర్పించాల్సి ఉంటుంది. అందుకోసం వాటర్/గ్యాస్ కనెక్షన్ (కనీసం ఏడాది)ఎలక్ట్రిసిటీ బిల్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఇండియన్ పాస్ పోర్టు, రెవన్యూ డిపార్ట్ మెంట్ ల్యాండ్ ఓనింగ్ రికార్డు, రిజిష్టర్డ్ రెంట్ లీజ్ డీడ్, రిజిస్టర్డ్ సేల్ డీడ్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది.

పై వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ఒక్కసారి ప్రివ్యూ చూసుకొని వివరాలు సరిగ్గా ఉంటే సబ్మిట్ చేయాలి.

Voter ID Address Change : అప్లికేషన్ స్టేటస్ ఇలా తెలుసుకోండి:

  • ఓటర్ ఐడీ అడ్రస్ మార్చేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినట్లయితే https://www.nvsp.in/ వెబ్‌సైట్ ఓపెన్ కావాలి.
  • హోమ్ పేజీలో Track Application Status పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత రిఫరెన్స్ ఐడీ ఎంటర్ చేయాలి.
  • Track Status పైన క్లిక్ చేయాలి.
  • మీ దరఖాస్తు స్టేటస్ తెలుస్తుంది.


This post first appeared on APTEACHERS9, please read the originial post: here

Share the post

How To Change Address On Voter Id Card

×

Subscribe to Apteachers9

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×