Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gold Loan: Taking Gold Loan? These are the banks that give gold loans at the lowest interest rates..!

Gold Loan: Taking Gold Loan?  These are the banks that give gold loans at the lowest interest rates..!

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అతి తక్కువ వడ్డీ రేట్లకు బంగారు రుణాలు ఇచ్చే బ్యాంకులు ఇవే..!

అమెరికాలో బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం కారణంగా పసిడి ధర గత కొన్ని మాసాల్లో భారీగా పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,000 మార్కును దాటింది. దీంతో బంగారంపై ఇచ్చే రుణ మొత్తాన్ని కొన్ని బ్యాంకులు పెంచాయి. అదే సమయంలో కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచడంతో బంగారు రుణాలపై వడ్డీ రేట్లు బ్యాంకులు పెంచాయి. వ్యక్తిగత అత్యవసరాల కోసం అత్యవసర ఆర్థిక అవసరాల కోసం బంగారు రుణాలు వెంటనే లభిస్తాయి. క్రెడిట్ స్కోరును పరిగణలోకి తీసుకోకుండానే బ్యాంకులు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తాయి. కొన్ని గంటల వ్యవధిలోనే రుణాలు పొందేందుకు వీలుంటుంది. బంగారు రుణాలపై వడ్డీ రేట్లు మిగిలిన వాటితో పోల్చితే తక్కువగా ఉండటం విశేషం. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు బంగారు రుణాలపై అతి తక్కువ వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 9 శాతం కంటే తక్కువ రేట్లకే బంగారు రుణాలు ఇస్తున్నాయి. 9 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుకు బంగారు రుణాలు ఇస్తున్న బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు ఏవో ఇప్పుడు చూద్దాం.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక్కటైన ఈ బ్యాంకులో బంగారు రుణాలపై రెండేళ్ల కాలవ్యవధికి 8.45 శాతం వడ్డీ రేటు ఉంది. రూ. 5 లక్షల బంగారు రుణంపై రూ. 22,716 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ బ్యాంకు 8.65 శాతం వడ్డీ రేటుకు బంగారు రుణాలు ఇస్తుంది. రెండేళ్ల కాలవ్యవధికి ఇచ్చే రూ.5 లక్షల బంగారు రుణంపై రూ. 22,762 ఈఎంఐ ఉంది.

యూకో బ్యాంకు: ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బ్యాంకు 8.8 శాతం వడ్డీ రేటుతో బంగారు రుణాలు ఇస్తోంది. రెండేళ్ల కాలవ్యవధికి ఇచ్చే రూ.5 లక్షల బంగారు రుణంపై రూ. 22,797 ఈఎంఐ ఉంటుంది.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు: ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల బంగారు రుణాలపై 8.85 శాతం వడ్డీ రేటు ఉంటుంది. మీరు రూ. 22,808 EMIని చెల్లించాలి.

ఇండియన్ బ్యాంక్: ఈ ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకు 8.95 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల బంగారు రుణంపై EMI మొత్తం రూ. 22,831 అవుతుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ బ్యాంకు రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల గోల్డ్ లోన్‌పై 9.15 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. రుణగ్రహీతలు రూ.22,877 EMI చెల్లించాల్సి ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు: ఈ బ్యాంకు గోల్డ్ లోన్‌పై 9.25 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తుంది. రెండేళ్ల కాలవ్యవధితో రూ. 5 లక్షల రుణంపై EMI మొత్తం రూ. 22,900 అవుతుంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఇది రెండేళ్ల కాల వ్యవధితో రూ. 5 లక్షల రుణంపై 9.3 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రుణగ్రహీత రూ.22,911 EMI చెల్లించాలి.

ఫెడరల్ బ్యాంకు: ఈ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల బంగారు రుణాలపై 9.49 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. EMI రూ. 22,955 అవుతుంది.

బజాజ్ ఫిన్‌సర్వ్ : నాన్ బ్యాంక్ ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ (NBFC) రంగానికి చెందిన బజాజ్ ఫిన్‌సర్వ్ తక్కువ వడ్డీకి బంగారు రుణాలు ఇస్తుంది. బంగారు రుణాలపై 9.5 శాతం వడ్డీని విధిస్తుంది. రుణగ్రహీత రెండేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల రుణంపై రూ. 22,957 EMI చెల్లించాల్సి ఉంటుంది.

Note: BankBazaar.com లోని సమాచారం మేరకు ఈ వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరికొన్ని బ్యాంకులు 9 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుకు బంగారు రుణాలు ఇస్తున్నాయి. సంబంధిత బ్యాంకుల వెబ్‌సైట్లు లేదా నేరుగా ఆ బ్యాంకుల శాఖలను సంప్రదించి బంగారు రుణాలపై వడ్డీ రేటును మీరు చెక్ చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు బంగారు రుణాల మంజూరుకు ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా వసూలు చేస్తాయని గమనించగలరు.



This post first appeared on APTEACHERS9, please read the originial post: here

Share the post

Gold Loan: Taking Gold Loan? These are the banks that give gold loans at the lowest interest rates..!

×

Subscribe to Apteachers9

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×