Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

శ్రీమంతంలో మట్టి గాజులను ఎందుకు వేస్తారు?


ఆడవారి అలంకరణలో ముఖ్యంగా గాజులు,ముక్కెర,గొలుసులు,చెవి రింగులు వంటివి ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో మహిళల అలంకరణలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. జడ వేసుకోవటం మానేసి పోనీ టైల్ వేసుకుంటున్నారు. గాజులు వేసుకోవటం కూడా మానేసారు. మంచి చీర కట్టుకొని మెడలో నగలు వేసుకొని మంచిగా తయారు అయినప్పుడు చేతికి గాజులు లేకపోతె అది లోటుగానే ఉంది. అయితే ఇప్పుడు గాజుల వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. 

CLICKHERE : గారెలు వండేటప్పుడు కొన్ని చిట్కాలు 

గాజులను పూర్వ కాలంలో మగవారు కూడా వేసుకొనేవారు. కాలక్రమేనా గాజులను మగవారు వేసుకోవటం మానేసి మహిళలకు అలంకరణగా గాజులు మారాయి. 

CLICKHERE : బాదం నూనెలో ఉన్న ఆరోగ్య,బ్యూటీ ప్రయోజనాలు 

పుట్టిన పిల్లలకు దిష్టి తగలకుండా ఉండటానికి నల్లని గాజులను వేస్తారు. అలాగే ఆ గాజుల సవ్వడికి పిల్లలు ఆనందంగా ఉంటారు. 

గాజులు ధరించటం వలన మహిళల్లో నడవడిక మారుతుంది. అది ఎలా అంటే గాజులు సున్నితంగా ఉంటాయి. వాటిని పగలకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది. గాజు పగిలితే అతకటం ఎంత కష్టమో జీవితం కూడా అంతే అని గాజులు సూచిస్తాయి. 

CLICKHERE : దోసెల పిండి పులుపు ఎక్కకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

పెళ్లి అయిన స్త్రీలు చేతుల నిండా గాజులు ధరించాలి. అది వారి సౌబాగ్యాన్ని సూచిస్తుంది. ఎప్పుడు గాజులు ఉండేలా చూసుకోవటమే కాకుండా అవి పగలకుండా కూడా చూసుకోవలసిన అవసరం ఉంది. 

శ్రీమంతంలో తప్పనిసరిగా మట్టి గాజులను వేస్తారు. 5 వ నెలలో గర్భంలో ఉన్న బిడ్డకు ప్రాణం వస్తుంది. పురిటిలో బిడ్డ ఎంత సున్నితంగా ఉంటుందో, ఆ బిడ్డను ఎంత సున్నితంగా చూసుకోవాలో గాజులు తెలియజేస్తాయి. అంతేకాక ఆ గాజులను పగలకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 

CLICKHERE : లంచ్ బాక్స్ వాసన రాకుండా ఉండాలంటే... 

మోచేతికి మరియు మణికట్టుకు మధ్య ఉన్న నాడులకు గర్భాశయ నాడులతో సంబంధం కలిగి ఉంటుంది. 

గాజులు కదలడం వలన ఆ ప్రాంతంలోని నాడులు స్వల్పంగా ఒత్తిడి కలిగి తద్వారా గర్భాశయ నాడులు ఆ ఒత్తిడికి అనుగుణంగా స్పందిస్తాయి. అలాగే గర్భాశయంలో కండరాలు సవ్యంగా పనిచేయటానికి సహాయపడతాయి. 

గాజులు ధరించటం వలన పుట్టే పిల్లల్లో వినికిడి శక్తి మెరుగు అవుతుంది. చేతులకు వేసుకొనే గాజులు గర్భానికి దగ్గరగా ఉండుట వలన ఆ గాజుల సవ్వడి పుట్టే బిడ్డలో వినికిడి శక్తి పెరగటానికి సహాయపడుతుంది. 

CLICKHERE : పూరీ క్రిస్పిగా రావాలంటే ఏమి చేయాలి?

CLICKHERE : ఇడ్లీ మృదువుగా మెత్తగా రావాలంటే....  



This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

శ్రీమంతంలో మట్టి గాజులను ఎందుకు వేస్తారు?

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×