Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

జ‌బ‌ర్ద‌స్త్.. ఖ‌త‌ర్నాక్ షో వివాదం అవుతుందా?


ఈ మధ్య కాలంలో ఈ టీవిలో ప్రసారం అవుతున్న జ‌బ‌ర్ద‌స్త్ షో ఎంత పాపులర్ అయిందో మనకు తెలిసిందే. ఈ షో మొదట్లో వారానికి ఒకసారి ప్రసారం అయ్యేది. ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టటంతో మల్లెమాల వారు ఈ షో ని వారానికి రెండు సార్లు ప్రసారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంతో ఈ టివీ టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగా పెరిగాయి. ఈ షో  నుంచి ఎంత ఆదరణ ఉందో...అంతే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ వివాదాస్పద రీతిలో వార్తల్లోకి వచ్చింది. 

CLICKHERE: అరటి ఆకులో భోజనం చేయటం వలన ఉపయోగాలు ఏమిటి?

ఈ కార్యక్రమం డ‌బుల్ మీనింగ్ డైలాగ్ లు, మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఉండటంతో కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాక ఒక సామజిక వర్గం వారు నటులపై బహిరంగంగానే దాడులు జరిగాయి. అప్పుడు ఈ షో లో నటులందరూ కేవలం మేము సరదా కోసం మాత్రమే చేస్తున్నామని, ఎవరైనా హార్ట్ అయితే క్షమించమని కోరారు. ఇప్పుడు మరల న్యాయవాద వృత్తిని అవమానించేలా స్కిట్ చేసారని హుజరాబాద్ కు చెందిన న్యాయవాది అక్కడి స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశాడు.

CLICKHERE : ప్రభాస్ ఇంటి గురించి తెలియని విషయాలు 

న్యాయవాద వృత్తిని అవమానించిన జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ పై చర్యలు తీసుకోవాలని మల్లెమాల ప్రొడక్షన్స్ వారి తో సహా యాంక‌ర్ రష్మి, నాగబాబు, రోజా, ఇతర నటీనటులందరి పేర్లు ఉన్నాయి. ఈ షో లో నటించిన నటీనటులు మాత్రం కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. ఈ షో మీద ఎన్ని వివాదాలు వచ్చినా, ప్రేక్షక ఆదరణ మాత్రం అసలు తగ్గటం లేదు. ముందు ముందు వచ్చే సమస్యలకు ఈ టివీ ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి. 

CLICKHERE : దేవాలయాల్లో తలనీలాలను ఎందుకు సమర్పించాలి?

CLICKHERE : ఒంటి నొప్పులు తగ్గటానికి ఆహారాలు 


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

జ‌బ‌ర్ద‌స్త్.. ఖ‌త‌ర్నాక్ షో వివాదం అవుతుందా?

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×