Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అంకితం

అంకితముశ్రీ కారుణ్య మగణ్యమై కవి జగజ్జేగీయ సాద్గుణ్యమై 
లోకాలోకపరీత యావదవనీ లుంటాక పంటాన్వయా
నీక ఖ్యాతి శరణ్యమై వెలయు వన్నెల్‌ పొన్నలూర్వంశపుం 
బ్రాకారంబుల బచ్చతోరణములై వాసించు నశ్రాంతమున్‌కవితాతుందిల మందహాసుడును రాకా శీకరాంశుప్రభా
నివహక్షీర పటీర గాంగలహరీ నీహార హారావళీ
శివసంకాశ యశః ప్రకాశయుతుడౌ శ్రీ కోటరెడ్డి ప్రభుం
డవిలంఘ్య ప్రతిభా సముద్భట లుఠత్‌ ద్యావామహీమండలీ
ప్రవసత్‌ తేజుడు వీర రాఘవ మహా భాగుండు తద్వంశ సం
భవులై భవ్య పరంపరా విభవులై భాసింతు రెంతేనియున్‌
దివిషద్వీధికి చంద్రసూర్యుల వలెన్‌ తేజంబు వాటించుచున్‌.నరులేగాదు సురాసురాద్యఖిల త్రింశత్కోటి బృందారకుల్‌
సరియే తన్మహనీయ వంశలతికా సంజాత మల్లీవిక
స్వరకింజల్క కిశోరమూర్తికి సమస్త గ్రంథసందర్భ ని
ర్భర విద్యా మహనీయమూర్తికిని శుంభ ద్రెడ్డి కోటయ్యకున్‌.పున్నమనాటి రేయి విరబూచిన కన్నె గులాబి గిన్నెలో
వెన్నెల తూలికం దడిపి విశ్వవిధాత దిగంతసీమలం
జెన్నగు మేలుబంతిగ వచించి రచించిన యట్టి సర్వలో
కోన్నత మూర్తియై వెలయు కోటయరెడ్డికి సాటియుందురే.ఆతడజాతశత్రుడు సమస్త సుధీజనమిత్రుడార్జవో
పేతచరిత్రు డగ్రపదవీ భరణైక సమగ్రపాత్రుడున్‌
భూతల సర్వమానవ సమూహ శిరోమణియంచు నెంచి వి
ఖ్యాతిగ మద్వచో గగనఘంట ఘటించి వచింతు నెంతయున్‌.మాటలు గావు మా హృదయ మంజుల కుంజములందు జల్లు ప
న్నీటి వెలంది తేటలది నెయ్యముగాదు సరోజపత్రికా
పాటల కాంతి పుంజములపై బరుగెత్తు మరంద ధార, వే
యేటికి సాధుతోయధి జనించిన పూర్ణ శశాంక మూర్తియే.వేయి గులాబి కన్నెలర విచ్చునుగాక సహస్ర కోకిలల్‌
కోయని కూయుగాక ఒక కోటినిశీధులు పండువెన్నెలల్‌
గాయునుగాక నాహృదయ కంజము రంజిలబోదు తన్మృదు
చ్ఛాయల కోయిలంబలె ప్రశాంతి వసించెడు వేళలంబలెన్‌.తన సౌహార్దము సత్క్రియాచరణ విద్యావద్యమే గాని యే
క్షణికామోద వినోదకాలకలనా జన్యంబొగా, దామనిన్‌
వనసీమల్‌ పులకించి పూచి వలపుల్‌ వ్యాపించి దీపించిన
ట్లనయంబున్‌ విలసిల్లుగాతమని నేనాశింతు నాస్నేహమున్‌.కలిమిజూచి నేను కట్టుబడ్డది లేదు
బలిమిజూచి బెదరి పారలేదు
చెలిమి నన్నుబట్టి సేవకునింజేయు
చిగురుగుత్తి నాదు చిత్తవృత్తి.నాకుంగల్గిన భూరిహర్షమునకున్‌ దార్కాణగా నీకృతిన్‌
నీకర్పించితి మెచ్చి యీయపర వాణీమంజుమంజీరముల్‌
నీకల్యాణగుణాత్తకీర్తి కలకంఠీ కంఠఘంటాపథ
వ్యాకీర్ణ స్వరమాధురీభరములై వ్యాపించు తద్వైఖరుల్‌

Share the post

అంకితం

×

Subscribe to Telugu Pandita Darsini - తెలుగు పండిత దర్శిని

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×