Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

వినర ఓ రన్న..


రావణుడిని రాక్షసుడిగా చూడటం మాత్రమే 

మనం ఇంతవరకు చూశాం. 

కానీ అదే రావణున్ని దేవుడిగా

తమ పూర్వికుడిగా చూసే ఆదివాసీలున్నారు.

రావణుడికి ఆలయాలూ ఉన్నాయి. 

అంతేకాదు... 

రావణుడిపై రాక్షస ముద్ర వేసి 

చరిత్ర వక్రీకరించి 

సాంస్కృతిక దాడి చేశారన్నది ఆదివాసీల వాదన. 


ఇప్పటికీ చాలా చోట్ల 

ఆదివాసీల రావణ ఆలయాలు 

ఉన్నాయంటే

రావణుడిని వారెంత ఆదరిస్తారో అర్ధం చేసుకోవచ్చు.



మధ్యప్రదేశ్ లోని విదిశ జిల్లా .. 

రావణ్  గ్రామంలోని ఆలయం 

రాజస్థాన్ లో జోధాపూర్ సమీపం లోని 

స్థానికులు రామ రావణ యుద్ద్ధం తర్వాత .. 

శ్రీలంక నుంచి జోధాపూర్ వఛ్చి స్థిరపడినట్లు 

చెబుతారు..  


వీరితో పాటు మరికొన్ని తెగల వారు కూడా 

రావణుని వీరునిగా గౌరవిస్తారు.. 

కాన్పూర్ లోనూ రావణుని ఆలయం ఉంది.. 



ఆ ఆలయాన్ని దసరా రోజు మాత్రమే తెరిచి 

పూజలు 

నిర్వహిస్తారు.. 


ఇంకా  చాల ప్రాంతాలలో 

రావణుడే ఆరాధ్య దైవం 


వీరు ప్రపంచం లోనే 

అతి పెద్ద ఆదివాసీ తెగవారు .. 

వీరి భాషకు లిపి లేదు .. 


ఇలా చరిత్రలో హీరో లనుకున్న వాళ్ళు 

కాల క్రమంలో 

విలన్ లుగా మారిపోతే మనం ఆశ్చర్య పడక్కర్లేదు 



తొడగొట్టటాలు.. 

మీసం తిప్పటాలూ.. 

కత్తి దూయటాలు .. 


భీకర దృశ్యాలతో ప్రేక్షకులను వెర్రెత్తి పోయేలా 

చేసిన  గౌతమి పుత్ర శాతకర్ణిలో 

సత్యమెంత..?? 

చరిత్ర ఎంత..?? 

కల్పన ఎంత..??

అని తరచి చూస్తే.. 

ఏర్పడేది గందర గోళమే తప్ప మరేం కాదని 

సినీ పండితుల ఉవాచ .. 


ఇలాంటివే చాణక్యుని పైనా కల్పించారట 

ప్రసిధ్ధ వ్యక్తులపై అభూత కల్పనలు బయలు దేరడం 

సహజమే కదా.. 

చంద్రగుప్తుని కండగా నిలచిన చాణక్యుని పై 

కథలు.. నాటకాలు.. కావ్యాలు రాయడానికి 

ఆ కాలంలో చాలా మంది ప్రయత్నించి ఉండవచ్చు.. 

ఎందుకంటే .. 

అర్థ శాస్త్ర వేత్త గా .. 


రాజనీతిజ్ఞునిగా .. 

నందుల నంతం చేసి ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న 

పౌరుషవంతునిగా .. 

ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత కదా.. 


కొంతమంది వీరత్వాన్ని ఎంచుకుంటే .. 

కొందరు శారీరకంగా ఆయనపై దాడి చేయడానికి 

కూడా 

వెనుకాడ లేదు.. 


ఒక నాటక కర్త .. 

చాణక్యుని కురూపి గ .. 

వికృత దంతములు గల వానిగా మలచి 

ఆనంద పడినాడట .. 


ఈ విషయాలు .. 

మన పుట్టపర్తి తెనిగించిన మరాఠీ గ్రంధం .. 

'' భారతీయ ఇతిహాసాంతిల్ సాహసోనేరి సావే ''

''స్వర్ణ పత్రములు''

 లో మనకు కనిపిస్తాయి.. 

శక హూణాది విదేశీ దురాక్రమణదారులందరినీ తరిమికొట్టి 
జాతిని రక్షించిన చంద్రగుప్త విక్రమాదిత్య యశోధర్మాది భారత వీరుల విజయ గాధలను అభివర్ణించే స్పూర్తిప్రదమగు చారిత్రక పరిశోధక గ్రంధం  వీర సావర్కరు మరాఠీ భాషలో రచించిన 
'' భారతీయ ఇతిహాసాంతిల్ సహసోనేరి పానే '' 


ప్రసిధ్ధపురుషులను గురించి గాధలల్లుట సాధారణముగ వాడుక..
ఆ స్థితి యాతనికి దప్పలేదు.
చంద్రగుప్త చాణక్యులు మరణించిన పిదప 
ననేక సంవత్సరములకు వ్రాసిన గ్రంధములలో గట్టుకథలకు లెక్కలేదు..

జైన , బౌధ్ధ, వైదిక గ్రంధములలో నీ గాధలు

 భిన భిన్నములుగ గల్పింపబడెను..

సంస్కృత నాటక మొకటి గలదు..

ఆ నాటక కర్త కళాదృష్టితో గొన్ని గాధలల్లినాడు..
చాణక్యుడు కురూపియట..
అతని వికృత దంతములను గురించి 
నాటకకారులు విపులముగ వర్ణించిరి..

చంద్రగుప్తునాతడొకనాడు ద్రోవలో గలసెను..

నాటికి జంద్రగుప్తుడొకనాడొక గ్రామీణ తరుణుడు మాత్రమే.
వాని సాముద్రిక లక్షణములను చాణక్యుడు గమనించి యాతనిని సామ్రాజ్యాధిపతిగ నొనర్ప దలచెనట..
ఇట్టి వెన్నియో గల్పనలు..
ఈ కల్పనలలో గొన్ని యైతిహాసింక 
సత్య కణికలేమైనను గంపించునాయని జూతముగాక..

Share the post

వినర ఓ రన్న..

×

Subscribe to పుట్టపర్తి సాహితీ

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×