Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Punjab: ఆ ఘటన తర్వాత గట్కా నేర్చుకుంటున్న పంజాబ్ పోలీసులు

Punjab: వందలాది మంది నిరసనకారులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. తుపాకులు, కత్తులతో విరుచుకుపడ్డారు. బారీకేడ్లను కూడా లెక్కచేయకుండా దూసుకెళ్లారు. దెబ్బకు పోలీసులే దిగొచ్చారు. పోయిన వారం పంజాబ్‌లో జరిగింది ఈ ఘటన.

వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్ పాల్ సింగ్ అనుచరుడు లవ్ ప్రీత్ సింగ్‌‌ను అజ్నాలా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వందలాది మంది వారిస్ దే గ్రూప్ నిరసనకారులు ఆందోళనకు దిగారు. రాజకీయ దురుద్దేశంతోనే లవ్‌ప్రీత్ సింగ్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. గంటలో వెనక్కి తీసుకోవాలని లేదంటే జరిగే పరిణామాలకు అధికారులదే బాధ్యతని హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు లవ్‌ప్రీత్ సింగ్‌ను విడుదల చేశారు.

ఇక ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన పోలీసులు సిక్కుల సాంప్రదాయ యుద్ధ కళ గట్కాను నేర్చుకోవడం ప్రారంభించారు. ఇద్దరు స్పెషలిస్టులు పోలీసులకు గట్కా నేర్పిస్తున్నారని ముక్త్‌సర్‌ డీఎస్పీ అవతార్ సింగ్ వెల్లడించారు. దాదాపు 250 మంది పోలీసులు గట్కా నేర్చుకుంటున్నారని తెలిపారు. త్వరలో పోలీసులందరికీ గట్కా నేర్పిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Share the post

Punjab: ఆ ఘటన తర్వాత గట్కా నేర్చుకుంటున్న పంజాబ్ పోలీసులు

×

Subscribe to "big Tv - తెలుగు Breaking News | 24x7 Live News Updates న్యూస్ ఛానల్"

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×