Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Oppo New Smartphone : బడ్జెట్ ధరలో మరోకొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్

Oppo New Smartphone : టెక్ దిగ్గజం ఒప్పో మార్కెట్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. A సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేస్తుంది. అత్యంత చీపెస్ట్ ప్రైజ్‌‌లో కంపెనీ ఈ సిరీస్ ఫోన్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. సమచారం ప్రకారం ఇది Oppo A60 4G ఫోన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. దీని రెండర్‌లు కూడా లీక్ అయ్యాయి. అయితే దీని డిజైన్ గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఈ ఫోన్ 256 GB స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. రాబోయే ఈ ఫోన్లలో ఎటువంటి ఫీచర్లు ఉంటున్నాయి. తదితర వివరాలు తెలుసుకోండి.

Oppo A60 4G కంపెనీ చౌకైన స్మార్ట్‌ఫోన్. దీని రెండర్‌లు ఫోన్ ఫ్రంట్, బ్యాక్ ప్యానెల్ డిజైన్‌ను వెల్లడించారు. టిప్‌స్టర్ ప్రకారం ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ Oppo Reno10ని పోలి ఉంటుంది. ఇది ఫ్రంట్‌లో పంచ్ హోల్ కటౌట్‌తో ఉంటుంది. టిప్‌స్టర్ ఫోన్ స్పెసిఫికేషన్‌లను కూడా  అందించారు. ఇది 90Hz LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో 1604×720 పిక్సెల్ రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ 264 PPI పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంటుంది. 950 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో రావచ్చు. ఇది 8 GB RAM+ 128 GB స్టోరేజ్‌తో రావచ్చు. 256 GB స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉండొచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే 50MP+8MP+2MPగా ఉంటుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రావచ్చు.

Also Read : బెస్ట్ డీల్.. రూ.5499 లకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్

అంతేకాకుండా ఫోన్లో  ఫింగర్‌ప్రింట్ స్కానర్, మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కూడా కలిగి ఉంటుంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ ఉంది. ఫోన్‌లో ఛార్జింగ్ చేయడానికి USB-C 2.0 సపోర్ట్ ఉంది. ఇందులో Wi-Fi 6 కూడా ఉంటుంది. ఈ ఫోన్ బరువు 186 గ్రాములు.  ఫోన్ Android 14 ఆధారిత ColorOS 14.0.1తో రావచ్చు.

The post Oppo New Smartphone : బడ్జెట్ ధరలో మరోకొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్ appeared first on .

Share the post

Oppo New Smartphone : బడ్జెట్ ధరలో మరోకొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్

×

Subscribe to "big Tv - తెలుగు Breaking News | 24x7 Live News Updates న్యూస్ ఛానల్"

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×