Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

డిగ్రీతోనే ఐఐటీలో కొలువు | IIT Kanpur Recruitment 2022

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ -కాన్పూర్.. పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడు దల చేసింది. దీనిలో భాగంగా జూనియర్ అసిస్టెం ట్ విభాగంలో నియామకాలను చేపట్టనుంది. డిగ్రీ విద్యార్హతతోనే ఈ ఉద్యోగాలను సొంతం చేసుకో వచ్చు. వీటికి ఎంపికైతే నెలకు రూ.70వేల వరకు వేతనంగా పొందవచ్చు. అర్హతలు, ఆసక్తి గల అభ్య ర్డులు నవంబర్ 9 తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 119 

అర్హతలు " కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకో వచ్చు. అలాగే వీరికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. దీంతోపాటు ఎస్టాబ్లిష్మెంట్ మేట ర్స్/ఆర్ అండ్ డీ/లీగల్/పర్చేస్ అండ్ ఇంపో ర్/అకౌంట్స్ /ఆడిట్/హాస్పిటాలిటీ మొదలైన విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. 

» వయసు: 09.11.2022 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఐఐటీ కాన్పూర్‌లో పనిచేసే ఉద్యోగులకు గరిష్ట వయసు 50 ఏళ్లుగా నిర్ణయించారు. వీరికి తగిన విద్యార్హతలు ఉండాలి.

» వేతనాలు: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పే లెవల్ -08 ప్రకారం -నెలకు రూ.21,700 -రూ.69,100 వరకు వేతనంగా పొందుతారు.

» ఎంపిక ఇలా: వచ్చిన దరఖాస్తులను షార్ట్ చేయడం, రాత పరీక్ష/ జాబ్ ఓరియెంటెడ్ ప్రాక్టి కల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా 

» దరఖాస్తులకు చివరి తేదీ: 09.11.2022 

" వెబ్ సైట్: www.iitk.ac.in/new/recruitment 



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

డిగ్రీతోనే ఐఐటీలో కొలువు | IIT Kanpur Recruitment 2022

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×