Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసే వారికీ గుడ్ నోటిఫికేషన్ మిస్ అవకండి | SSC MTS Recruitment 2022

 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. మల్టీటా స్కింగ్(నాన్ టెక్నికల్),హవల్దార్(సీబీఐసీ అండ్ సీబీఎన్) పోస్టులకు పరీక్షను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం ఖాళీల సంఖ్య: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్-టెక్నికల్)

» హవల్దార్‌(సీబీఐసీ అండ్ సీఎన్)-3608   

 » అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ (పదో తరగతి) పరీక్ష/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.. 

» వయసు: వివిధ విభాగాలను అనుసరించి 01.01.2022 నాటికి 18-25 ఏళ్లు, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

» ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష (పేపర్-1, పేపర్-2), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్ టీ) ఆధారంగా ఎంపికచేస్తారు...

» పరీక్షా విధానం: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఇంటెలి జెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టి ట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్టులు ఉంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 

» పేపర్-2 డిస్క్రిప్టివ్ పద్దతిలో ఉంటుంది. ఇది 50 మార్కులకు ఉంటుంది.షార్ట్ ఎస్సే/లెటర్ ఇన్ ఇంగ్లిష్ రాయాల్సి ఉంటుంది. పరీక్షా సమయం 45 నిమిషాలు కేటాయిస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:30.04.2022 

» కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్-1): జూలై 2022 

» టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్): తేది వెల్లడించాల్సి ఉంది. 

» వివరాలకు వెబ్ సైట్: https://ssc.nic.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసే వారికీ గుడ్ నోటిఫికేషన్ మిస్ అవకండి | SSC MTS Recruitment 2022

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×