Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

తెలంగాణలో మార్చి 9న జాబ్ మేళా 120ఖాళీలు 25వేలకు పైగా జీతం

 మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల 9న జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు: ప్రముఖ సంస్థ లో 120 ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు

బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిగ్యూటివ్ విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ/ఎంబీఏ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12,500-15 వేల వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు తెలంగాణలోని ఏ జిల్లాలోనైనా పని చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

కస్టమర్ సపోర్ట్ ఎగ్జికూటీవ్: ఈ విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ/బీటెక్/ఎంబీఏ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనైనా పని చేయాల్సి ఉంటుంది.

బ్రాంచ్ రిలేషన్ షిప్ మేనేజర్: ఈ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.28 వేల వరకు వేతనం ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఇంటర్వ్యూ నిర్వహించే వేధిక: ప్రైవేట్ ఐటీఐ, ఎఫ్సీఐ గోదాం పక్కన, మెదక్

అభ్యర్థులు https://forms.gle/maEbhrpmnqziBAHA9 లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 9న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్న ఇంటరర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.





This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

తెలంగాణలో మార్చి 9న జాబ్ మేళా 120ఖాళీలు 25వేలకు పైగా జీతం

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×