Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త అపెక్స్ బ్యాంక్ లో జాబ్స్

డిగ్రీ విద్యార్హతతో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ స్టేట్ కో-ఆప‌రేటీవ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న జిల్లా కో-ఆప‌రేటీవ్ సెంట్ర‌ల్ బ్యాంక్ (డీసీసీబీ)లో పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదలైంది. జిల్లాల వారీగా వేర్వేరుగా సంస్థ ప్రకటనలు జారీ చేసింది. 

మొత్తం 445 ఖాళీలను భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇందులో 

స్టాఫ్ అసిస్టెంట్ 372, 

అసిస్టెంట్ మేనేజ‌ర్ 73 పోస్టులు ఉన్నాయి. 

ఈ ఖాళీలకు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణ సాధించిన వారు అర్హులు. తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండాలి. 

ప్రిలిమ్స్ పరీక్ష్ నిర్వహించి, అందులో పాసైన వారికి మెయిన్స్ పరీక్ష చేపడతారు. ఆ తరువాత మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పరీక్ష ఫీజును రూ.250గా, మిగిలిన వారికి రూ.900లుగా నిర్ణయించారు. 

అభ్యర్థులు పూర్తి వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://tscab.org/dccbs-2/ను సంద‌ర్శించొచ్చు.



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త అపెక్స్ బ్యాంక్ లో జాబ్స్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×