Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Bharat Electronics Limited _ BEL Recruitment 2022 | బెల్ ఉద్యోగాల భర్తీ

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 247

పోస్టుల వివరాలు: 

ప్రాజెక్ట్ ఇంజనీర్లు-67,

ట్రెయినీ ఇంజనీర్లు-169, 

ట్రెయినీ ఆఫీసర్లు(ఫైనాన్స్)-11.

ప్రాజెక్ట్ ఇంజినీర్లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్,మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్,సివిల్. 

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలోఅనుభవం ఉండాలి. వయసు: 01.01.2022 నాటికి 32 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: మొదటి ఏడాది నెలకి రూ.40,000, రెండో ఏడాది నెలకి రూ.45,000, మూడో ఏడాది నెలకి రూ.50,000, నాలుగో ఏడాది నెలకి రూ.55,000 చెల్లిస్తారు.

ట్రెయినీ ఇంజనీర్లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చర్. అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)/ బీఆర్క్ (ఐదేళ్లు) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి. వయసు: 01.01.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: మొదటి ఏడాది నెలకి రూ.30,000, రెండో ఏడాది నెలకి రూ.35,000, మూడో ఏడాది నెలకి రూ.40,000,

» ట్రెయినీ ఆఫీసర్లు (ఫైనాన్స్): అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఫైనాన్స్ స్పెషలైజేషన్లో ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి. వయసు: 01.01.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: మొదటి ఏడాది నెలకి రూ.30,000, రెండో ఏడాది నెలకి రూ.35,000, మూడో ఏడాది నెలకి రూ.40,000.

» ఎంపిక విధానం: బీఈ/బీటెక్/బీఎస్సీ/ఎంబీఏలో సాధించిన మెరిట్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.02.2022 

వెబ్ సైట్: www.bel-india.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

Bharat Electronics Limited _ BEL Recruitment 2022 | బెల్ ఉద్యోగాల భర్తీ

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×