Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పోస్టల్ నోటిఫికేషన్ // పోస్టల్ శాఖ లో డ్రైవర్ ఉద్యోగాలు

తమిళనాడు పోస్టల్ సర్కిల్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ (Staff Car Driver) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. కొయంబత్తూర్, ఈరోడ్, నీల్‌గిరీస్, సేలం, తిరుప్పూర్ ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి. 

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మార్చి 10 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్స్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

వయస్సు- 56 ఏళ్ల లోపు

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్- The Manager Mail Motor Service, Goods Shed Road, Coimbatore – 641001.

దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 10

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 మార్చి 10

ఈ జాబ్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

పోస్టల్ నోటిఫికేషన్ // పోస్టల్ శాఖ లో డ్రైవర్ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×