Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఉత్తరఖాండ్ లో పని చేయాల్సి ఉంటుంది. 

ఖాళీల వివరాలు..

మొత్తం ఖాళీలు - 15

1) ఎగ్జిక్యూటివ్ (హైడ్రో) మెకానికల్ 5 పోస్టులు

2) ఎగ్జిక్యూటివ్ (హైడ్రో) సివిల్ 10 పోస్టులు

విద్యార్హతల వివరాలు:

ఎగ్జిక్యూటివ్ (హైడ్రో) మెకానికల్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

ఎగ్జిక్యూటివ్ (హైడ్రో) సివిల్ : సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల వేతనం చెల్లించనున్నారు. ఇంకా HRA/ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి.

వయో పరిమితి: అభ్యర్థుల గరిష్ట వయస్సును 35 ఏళ్లుగా నిర్ణయించారు.

నోటిఫికేషన్ వివరాలు: https://careers.ntpc.co.in/main/folders/Archives/advt/10.21%20detailed%20en.pdf

ఈ పోస్టుల దరఖాస్తుకు నవంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×