Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నిరుద్యోగులకు, యువతకు గుడ్ న్యూస్ || సెంట్ర‌ల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

రాంచీలోని సెంట్ర‌ల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్‌) లో ఖాళీగా ఉన్న జూనియ‌ర్ ఓవ‌ర్‌మెన్ పోస్టుల భ‌ర్తీకి నోటీఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. 

ఈ నోటిఫికేష‌న్ ద్వారా 75 పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది.  నవంబర్‌ 11 దరఖాస్తుకు చివరితేది. 

సంస్థ పేరు :  రాంచీలోని సెంట్ర‌ల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్‌) 

మొత్తం పోస్టులు: 75

అర్హ‌త‌: ఓవ‌ర్‌మెన్ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి. గ్యాస్ టెస్టింగ్‌, ఫ‌స్ట్ ఎయిడ్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి.

వయసు: అభ్య‌ర్థులు 18 నుంచి 30 ఏళ్ల లోపు వారై ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: అభ్య‌ర్థుల‌ను రాతప‌రీక్ష ద్వారా ఎంపిక‌చేస్తారు.

ప్రారంభ జీతం: రూ. 31,852

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులు సీసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. హార్డ్ కాపీని ప్రింట్‌తీసి అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి సంబంధిత చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్ట‌ర్ పోస్టు ద్వారా న‌వంబ‌ర్ 21లోపు పంపించాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.centralcoalfields.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: అక్టోబ‌ర్ 12, 2020

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 11, 2020

వెబ్‌సైట్‌: http://www.centralcoalfields.in/



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

నిరుద్యోగులకు, యువతకు గుడ్ న్యూస్ || సెంట్ర‌ల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×