Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఇంటర్ నెట్ ద్వార(ఆన్‌లైన్) డబ్బు సంపాదించడం 100% నిజం,ఎలా? మీ కంప్యూటర్ కు ఇంటర్ నెట్ (Internet) కనెక్షన్


ఇంటర్ నెట్ ద్వారా ఆదాయం పొందడం 100 % నిజం కాకపోతే పదిమంది స్టాఫ్ ను పెట్టకుని మాత్రం సంపాదించడం వీలుకాదు.ఎందుకంటే మన పనిచేస్తున్న కంప్యూటర్ .పి.నెంబర్ మనం ఆధాయం పొందే వెబ్ సైట్లకు ఖచ్చితంగా తెలిసిపోతుంది.ఒక్క కంప్యూటర్,నెట్ కనెక్షన్ పై ఒక్క యూజర్ ను మాత్రమే అనుమతించడం అసలు కారణం.ఇక అసలు విషయానికి వద్దాం.

         మీ పెట్టుబడి అల్లా మీ కంప్యూటర్ కు ఇంటర్ నెట్ కనెక్షన్ అవసరం.మీకు ఇది వరకే నెట్ కనెక్షన్ ఉంటే పర్వాలేదు.లేదంటే మీరు కొత్తగా ఇంటర్ నెట్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.నెలసరి అన్ లిమిటెడ్ కనెక్షన్ తీసుకుంటే సిటిల్లో కేబుల్ ద్వార,ఇతర ఏయిర్టెల్(Airtel) టాటా(DOCOMO),రిలయన్స్(Reliance), తదితర సర్వీసుల నెట్ కనెక్షన్ 500 రూపాయలు ఉంది. పట్టణాల్లో,గ్రామల్లో బి.ఎస్.ఎన్.ఎల్ బ్రాడ్ బాండ్(BSNL Broadband) లైన్ ద్వారా 1 జి.బి.(1 GB)లిమిట్ తో రూ.100 ఉంది.. 
      నెట్ ద్వార ఆదాయం పొందడం అనేది ఒక రకంగా ప్రపంచంలో అతి సులువైన పని అనే చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఒక వస్తువును అమ్మవలసిన పనిలేదు.ఒక బాస్ దగ్గర అతను చెప్పినట్లు చేయాల్సిన అవసరం లేదు.డ్యూటి కోసం అంటూ ట్రాఫిక్ లో ప్రయాణం అవసరం లేదు. మీ ఇంట్లో మీ కంప్యూటర్ ముందు కూర్చుని ప్రపంచాన్నే ఇంటర్ నెట్ ద్వారా మీ ముంగిటకు తెచ్చుకోండి
         ఇంటర్ నెట్ కనెక్షన్ ద్వారా ఆదాయం పొందడం అనేది నూటికి నూరు శాతం నిజం. ఇందుకోసం మీరు అదనంగా ఒక్క రూపాయి కూడా వెచ్చించనవసరం లేదు.మీ వ్యక్తిగత మనస్తత్వం ఇంకోకరి కింద పనిచేయడానికి ,నలుగురిలో కలిసి మెలిసి పోవడానికి ఇష్టపడని వారికైతే ఇది అత్యుత్తమ మార్గం.మీరు ఇది పార్ట్ టైం(part time) గా మొదలుపెట్టి ఓ మూడు నెలలు,ఆరు నెలల తరువాత మీకు సరిపడ ఆదాయం వస్తుంది అని నమ్మకం పుట్టిన తరువాత కావాలంటే ఫుల్ టైంగా చేయవచ్చు. 
Note:మీకు కావల్సిన అర్హత  కనీస ఇంగ్లీష్ (English) భాషా పరిజ్ఞానం,కనీస లెక్కల పరిజ్ఞానం,కంప్యూటర్ వాడకంతో పాటు ఇంటర్ నెట్ పరిచయం ఉంటే సరిపోతుంది.
హాయ్, నెట్ ఫ్రెండ్స్ ఇంటర్నెట్ ద్వారా నిజంగా డబ్బు సంపాదించవచ్చ లేదా తెలుసుకోండి .చాల మంది కి ఒక అపోహ వుంది ఇంటర్నెట్ ద్వారా డబ్బు రాదు అంత మోసం అని.కానీ మనము సరైన మార్గం లో వెళితే కచ్చితంగా డబ్బు సంపాదించవచ్చు 

ఇంటర్నెట్ ద్వారా నిజంగా డబ్బు సంపాదించవచ్చు కానీ దానికి ఓపిక వుండాలి ఒకే సారి వేల రూపాయలు వస్తాయి అని అనుకోవడం బ్రమ.డబ్బులు వస్తాయి కానీ నిదానంగా బాగా కష్టపడితే నెలకు 10,000.00 పది వేల వరకు సంపదించోచు కానీ మీరు చేసే సైట్స్ నమ్మకమైనవి అయ్యి వుండాలి.


                 ఆన్‌లైన్ జాబ్స్‌తో తీరిక వేళల్లో పనిచేస్తూ సంపాదించవచ్చు. చదువు కుంటూ పార్ట్‌టైం(part time) ఉద్యోగాలు చేయాల నుకుంటున్న యువత, అలాగే గృహిణు లకు ఆన్‌లైన్ జాబ్స్ ఓ వరం లాంటివి.


1.యాడ్ పోస్టింగ్(Ad Posting)
సాధారణంగా ఈ-మెయిళ్ళకు ఎన్నో వ్యాపార ప్రకటనలు వస్తూ ఉంటాయి. పెద్ద షాపింగ్‌మాల్స్, రెస్టారెంట్ తదితర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వారు ఈ-మెయిల్ ఐడీలను స్వీకరిస్తారు. అలాగే బ్యాంక్‌లు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ తదితర ఆర్థిక సంస్థలు ఖాతాలు తెరిచేటప్పుడు లేదా పెట్టుబడులు పెట్టినప్పుడు సదరు వ్యక్తుల ఈ-మెయిల్ ఐడీలను స్వీకరిస్తాయి. అలాంటి ఖాతాదారులకు తమ సంస్థలలో వచ్చిన కొత్త ఉత్పత్తులు, కొత్త విధానాలు లేదా స్కీమ్‌లు తెలియజెప్పేందుకే ఐడీల సేకరణ ఉంటుంది. ఇలా వేల సంఖ్యలో సంస్థలు ఈమెయిల్ ఐడీలు సేకరిస్తాయి.వ్యాపార నిర్వహణలో తలమునకలయ్యే ఆ సంస్థలకు అంత మందికి ప్రకటనలు పంపించే తీరిక ఉండదు. అందుకే పంపాల్సిన ప్రకటనను, ఈ-మెయిల్ ఐడీలను ‘యాడ్ పోస్టింగ్’ ఉద్యోగు లకు అందిస్తారు. ఈ ఉద్యోగులు చేయాల్సిందల్లా ఆ ప్రకటనలను ఇచ్చిన ప్రతి మెయిల్‌కు పోస్ట్ చేయడమే. ప్రకటనను ‘కాపీ’ చేసుకొని ఒక్కో ఐడీకి పంపాలి.http://www.adpostingjob.com/


వేతనం ఎలా ఉంటుంది?
వీటికి సంబంధించి వేతనాలు ఉండవు. ఒక ప్రకటన పంపినందుకు కొంత మొత్తం చెల్లిస్తారు. అంటే కమిషన్ రూపంలో ఉంటుంది. రిసీవ్ చేసుకున్న వ్యక్తి దానిని చూశాడా లేదా అన్నదానితో నిమిత్తం లేదు. పంపడం వరకే వీరికి బాధ్యత. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు గంటలు కూర్చుంటే సుమారుగా 50-60 వరకు ప్రకటనలను పోస్ట్ చేయొచ్చు. అలవాటు పడే కొద్ది ఇంకా ఎక్కువే పంపవచ్చు. అయితే ఒక్కో యాడ్‌కి ఎంత మేర చెల్లిస్తున్నారన్నది సంస్థలనుబట్టి మారుతుంది.ప్రకటనను కాపీ చేయడం .. ఈ-మెయిల్‌లో పేస్ట్ చేయడంపై కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. లేదంటే అది నేర్చుకోవడం పెద్ద సమస్య కాదు. ఇప్పటికే ఈ ఉద్యోగ నిర్వహణలో నిమగ్నమైన వారో లేదా డిటిపి లేదా ఎంఎస్-ఆఫీస్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళుకూడా ఈ పనిని తేలికగా పూర్తి చేయగలరు. పార్ట్‌టైమ్‌గా చేయాలనుకునే వాళ్లకు, గృహిణు లకు, ఇంటర్నెట్ సదుపాయం ఉండి... రోజు కనీసం 2 నుంచి 3 గంటల తీరిక ఉన్న వాళ్ళు అదనపు సంపాదనగా ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు.యాడ్ పోస్టింగ్ కొలువుకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లభ్యం అవుతాయి.


ఎంపికలో జాగ్రత్తలు
యాడ్ పోస్టింగ్‌కు ఎంపిక చేసుకునే సంస్థలను జాగ్రత్తగా పరిశీలించాలి. స్పామ్‌లలోకి వెళ్ళే మెయిళ్ళకు సంబంధించిన పనులను చేపట్టకపోవడమే మంచిది. తెలిసిన వాళ్ళో లేదా స్నేహితులో ఇప్పటికే చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించాలి. అలా ఎవ్వరూ పరిచయం లేని పక్షంలో సంస్థలో ఇప్పటికే యాడ్‌పోస్టింగ్ ఉద్యోగాలు చేస్తున్న వారి అడ్రస్‌లను సేకరించి వారి నుంచి వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. వివరాలు గూగుల్ సెర్చ్ ద్వారా కూడా సేకరించవచ్చు.


2.రిఫెరెన్స్‌తోనూ సంపాదన(Reference)
ఈ విధానంలో యాడ్స్ పోస్టింగ్ ద్వారా కొంతమేర సొంతంగా సంపాదించవచ్చు. ఇలా యాడ్స్ పంపేవాళ్లను రిఫర్ చేయడం ద్వారా... వారు పంపే దాని నుంచి సైతం కొన్ని సంస్థలు కమిషన్ చెల్లిస్తున్నాయి. అయితే ముందుగా విధి విధానాలు పూర్తిగా చదివి మ్రాతమే రంగంలోకి దిగడం మంచిది.


3.యాడ్ సీయింగ్(Ad Seeing)
దీని అర్థం ‘ప్రకటన చూడడం’. చూసినందుకుగాను ఒక్కో యాడ్‌కు కొంత మేర చెల్లిస్తారు. సంస్థలు తమ ఉత్పత్తులను భారీగా చూస్తున్నారంటూ రేటింగ్‌ను పెంచుకునేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. విధిగా ప్రకటనను కొంతసేపు చూడాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని ఎక్కువగా చూస్తే అంత మేర వేతనం ఉంటుంది.
ఎవరికి నప్పుతుంది ః తీరిక ఉండి... కంప్యూటర్‌పై పెద్దగా పరిజ్ఞానం లేని వాళ్ళకు ఈ రంగం మంచిది. తాత్కాలికంగా కొంతవరకూ ఆర్ధికంగా తోడ్పడుతుంది. కెరీర్ పట్ల ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేని వాళ్ళు దీని వైపు మళ్ళొచ్చు.


4.ఆన్‌లైన్ హోమ్ ట్యూషన్(ONLINE HOME TUITION)
ఆన్‌లైన్ ఉద్యోగాలకు సంబంధించి ఉత్తమమైన వాటిల్లో ఇది ముందుంటుంది. సంపాదన ఎక్కువగా ఉండడమే కాదు. పరిజ్ఞానాన్ని కూడా పెంచుతుంది. కెరియర్‌కు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. సాధారణంగా గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో వివిధ సబ్జెక్టులను బోధించాలి. అమెరికాకు చెందిన విద్యార్ధులకు కూడా బోధించేందుకు చాలా మంది ట్యూటర్ల అవసరం ఉంది. అయితే అమెరికాలో విద్యార్ధులకు బోధించేందుకు అర్ధరాత్రి వేళల్లోనే వీలుపడుతుంది. కారణం వారికి ఆ సమయంలో పగలు ఉంటుంది. కాబట్టి, ఇందులో వేతనాలు భారీగానే ఉంటాయి. గణితం, ఇంగ్లీష్ లాంటి కఠిన సబ్జెక్ట్‌లకు సంబంధించి వేతనాలు ఎక్కువగా ఉంటాయి. సైన్స్, సోషల్ తదితరాలకు తక్కువగా ఉంటాయి. గణితం, ఇంగ్లీష్‌లకు నెలకు పదో తరగతి స్థాయికి రూ.10,000 దాకా చెల్లిస్తారు. మిగతా సబ్జెక్టులకు అంతకంటే తక్కువగా ఉంటున్నాయి. ఎంసెట్, లేదా ఇతర పోటీపరీక్షలకు సైతం ఈ మధ్యకాలంలో డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఈ పరీక్ష నీట్ రూపంలో జాతీయ స్థాయి పరీక్షగా మారడంతో ట్యూషన్ పాయింట్లలాగే ఆన్‌లైన్ ట్యూషన్ పాయింట్లు సైతం ఏర్పడ్డాయి. వీటి ద్వారా విద్యార్ధులను ఎంపిక చేసుకునే వీలు కలుగుతుంది. అయితే ఇంట్లో ఇంటర్నెట్, వెబ్ కెమెరా తదితర సదుపాయాలు ఉండాలి.ఎవరికి నప్పుతుంది గ్రాడ్యుయేషన్, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి... ఇంకా ఉన్నత చదువులు చదువుతున్న వారు లేదా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న వాళ్ళకు ఇది మంచి కెరీర్. తమ చదువులు కొనసాగించే స్థాయిలో ఆర్థిక వెసులుబాటు కల్పిస్తాయి.


5.ఆన్‌లైన్ సర్వే(Online Survey)
ఆన్‌లైన్ జాబుల్లోకెల్లా బహుశ ఇది తేలికైంది కావచ్చు. ఆన్‌లైన్ సర్వే జాబ్‌లు అందించే ప్రత్యేక వెబ్‌సైట్లు ఉన్నాయి. అందులో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వివిధ అంశాలకు సంబంధించి ఆయా సంస్థలు కొన్ని ప్రశ్నలు పంపిస్తాయి. వాటికి స్పందించాల్సి ఉంటుంది. సర్వే చేయాల్సిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు ఈ-మెయిల్ లో వస్తాయి. వాటికి స్పందించాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు ఉండొచ్చు. ప్రశ్నలను అర్ధం చేసుకొని సరిగ్గా సమాధానం ఇవ్వగలిగే స్థాయిలో ఇంగ్లీషుపై పట్టు ఉంటే చాలు.
ఒక్కో స్పందనకు కొంత మొత్తం చెల్లిస్దారు. ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉంటే వేతనం ఎక్కువగానే ఇస్తారు. రోజు 3 నుంచి 4 గంటలు వెచ్చిస్తే సుమారుగా రూ.5 నుంచి రూ.6వేలు వరకు సంపాదించవచ్చు.

6.డాటా ఎంట్రీ వర్క్(Data Entry Work)
వేగంగా టైప్ చేయడంతోపాటు ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న వారికి ఇది నప్పుతుంది. ఆన్‌లైన్‌లో వచ్చే మెటీరియల్‌ను లేదా వివిధ అంశాలను సంస్థలు అడిగిన విధంగా డాటా ఎంట్రీ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకుగాను పేజీకి కొంత మొత్తం చొప్పున చెల్లిస్తారు.ఆన్‌లైన్ వర్క్‌కు సంబంధించి సంస్థలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. స్పామ్ మెయిల్స్, లేదా ఇతరేతర అనవసర ప్రోగ్రామింగ్‌ల జోలికి తీసుకెళ్లని సంస్థలనే ఎంచుకోవాలి. ఇందుకు చేరబోయే ముందు తెలిసిన వాళ్ళ ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాకే సరైన నిర్ణయం తీసుకోవాలి. 

7.స్వీయ పుస్తక ప్రచరణ (Self Publish Books):
కలంతో మంచి స్నేహం ఉందా..?, పుస్తకాలు రాయగలరా..? అయితే మీ కోసం అమోజాన్ సంస్థ ‘కైండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్'(Amazon's Kindle Direct Publishing ) పేరతో ఉచిత సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీస్‌లో భాగంగా మీరు రాసిన పుస్తకాన్ని మీరు స్వతహాగా ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేసుకోవచ్చు. మన దేశానికి చెందిన పలువురు రచయతలు ఈ తరహాలోనే ఆదాయన్ని అర్జిస్తున్నారు.
8.అప్లికేషన్‌లను తయారు చేసి విక్రయించండి (Make & Sell your Apps):
స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలు వినియోగం రోజురోజుకు విస్తరిస్తుండటంతో అపిక్లేషన్ విభాగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మీలో సాంకేతిక పరిజ్ఞానం(Technical Knowledge) పుష్కలంగా ఉన్నట్లయితే విభిన్నంగా ఆలోచించి అప్లికేషన్‌ను రూపొందించండి. మీ ఆలోచన బాగునట్లయితే సదురు అప్లికేషన్ కాసులు వర్షం కురిపిస్తుంది.
9.ఆన్‌లైన్ ద్వారా పాత వస్తువులను విక్రయించండి (Sell Old Stuff Online):
డబ్బు సంపాదించేందుకు ఇదో సులువైన మార్గం. మీ చుట్టు పక్కల ఉన్న పాత వస్తువులను సేకరించండి. click.in , olx.in, quikr.com వంటి వెబ్‌సైట్‌లు ఉచిత క్లాసిఫైడ్ వేదికలను ఏర్పాటు చేస్తున్నాయి. వాటిలో మీరు ఓ ఖాతాను తెరిచి మీ చెంత ఉన్న పాత ఉత్పత్తులకు సంబంధించి వివరాలను పొందుపరచండి. ఆసక్తి ఉన్న వారు మిమ్మల్ని సంప్రదించటం జరుగుతుంది.
10.ఈ-ట్యూటరింగ్ (E-Tutoring):
శిక్షణా విభాగంలో మీకు experience  ఉందా. ఏదైనా subjectను అనర్గళంగా బోధించగలరా..? అయితే మీకోసం www.2tion.net or www.tutorvista.com వంటి ఆన్‌లైన్ శిక్షణా Website లు ఎదురుచూస్తున్నాయి. ఈ వెబ్‌సైట్‌లలో మీ Profiles ను క్రియేట్ చేసినట్లయితే ధృవీకరణ అనంతరం ఔత్సాహికులు మీ services వినియోగించుకుంటారు. మీ నైపుణ్యం ఆధారంగా salary ఉంటుంది.



ముందుగా ముక్యమైనది ఇప్పుడు జరుగుతున్నా మోసాలు గురుంచి  తెలుసుకోవాలి

  1. అవునండి ఇప్పుడు ఇంటర్నెట్ పేరు తో చాల సైట్ లు పుట్ట గొడుగుల్ల పుట్టుకోస్తునాయి వీటిలో చాల సైట్ లు డబ్బు తీసుకొని Work ఇవ్వడము లేదు అందుకని మీరు సరైన శి&


This post first appeared on MAKE MONEY ONLINE -- SYED RAFIQ, please read the originial post: here

Share the post

ఇంటర్ నెట్ ద్వార(ఆన్‌లైన్) డబ్బు సంపాదించడం 100% నిజం,ఎలా? మీ కంప్యూటర్ కు ఇంటర్ నెట్ (Internet) కనెక్షన్

×

Subscribe to Make Money Online -- Syed Rafiq

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×