Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

టాలీవుడ్ కి దొరికిన మరొక కమెడియన్…ఇతను ఎవరో తెలుసా.?

సంగీత్ శోభన్…ప్రస్తుతం టాలీవుడ్ లో ఆశాజనకంగా కనిపిస్తున్న ఒక యువ టాలెంట్. గట్టి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎటువంటి సపోర్ట్ తీసుకోకుండా ప్రతి అడుగు తన సొంత సత్తా పై వేస్తూ నటుడిగా ఎదుగుతున్నాడు. ఇటీవల విడుదలైన మ్యాడ్ మూవీ తర్వాత ఇతను మరింత ట్రెండింగ్ గా మారాడు. సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నప్పటికీ సంగీత శోభన్ బాగా హైలైట్ అయ్యాడు.

అతని టైంలీ కామెడీతో…ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా.. చక్కలిగింతలు పెడుతున్నాడు. చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీకి మంచి కమీడియన్ దొరికాడు అని ప్రేక్షకులు ఫీల్ అయ్యే రేంజ్ లో ఉంది అతని పర్ఫామెన్స్. టాలీవుడ్ లో కమెడియన్స్ కి కొదవలేదు.. కానీ ఒకప్పటి కామెడీ ఇప్పటి కమెడియన్స్ లో లేదు. బ్రహ్మానందం దగ్గర నుంచి అలీ వరకు ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన కమీడియన్స్. ఇప్పటికీ ఉన్నప్పటికీ …అప్పటి కథ వేరు..

సంగీత్ శోభన్ పర్ఫామెన్స్ తిరిగి అప్పటి జలక్ ని ఒక్కసారి తెరపైన చూపించింది. సంగీత్ శోభన్ మొదట ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా గోల్కొండ హై స్కూల్ మూవీతో పరిచయమయ్యాడు. వర్షం ,చంటి, బాబి లాంటి సినిమాలకు డైరెక్షన్ బాధ్యతలు వహించిన శోభన్ కుమారుడే ఈ సంగీత్ శోభన్. ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్ర హీరో అయిన సంతోష్ శోభన్ కి స్వయానా తమ్ముడు.

క్యూట్ లుక్స్ తో ఉండే సంగీత్ శోభన్ తండ్రిలాగా డైరెక్టర్ కాకుండా అతని పెదనాన్న కమీడియన్ లక్ష్మీపతి లాగా అందరినీ నవ్వించడానికి డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికే యూట్యూబ్ మరియు పలు చిత్రాల ద్వారా ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకున్న సంగీత్ శోభన్ మ్యాడ్ చిత్రంతో మరింత పాపులర్ అయ్యాడు. దీంతో యూట్యూబ్ వీడియోస్ లో ఓటీటీ లో తెగ సందడి చేసే ఈ నవ్వుల వీరుడు వెండితెరపై కూడా నవ్వులు పూయించడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం అవుతుంది.

The post టాలీవుడ్ కి దొరికిన మరొక కమెడియన్…ఇతను ఎవరో తెలుసా.? appeared first on Prathi Dvani - The Sound of Every Telugu Heart Beat.



This post first appeared on Latest Telugu News, please read the originial post: here

Share the post

టాలీవుడ్ కి దొరికిన మరొక కమెడియన్…ఇతను ఎవరో తెలుసా.?

×

Subscribe to Latest Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×