Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

వీక్ క్లైమాక్స్ కారణంగా విజయం సాధించలేకపోయిన 6 తెలుగు సినిమాలు..

కొన్ని చిత్రాలు మొదలైనప్పటి నుండి ప్రీ క్లైమాక్స్ వరకు ఆడియెన్స్ కి చాలా నచ్చుతాయి. కానీ సినిమా క్లైమాక్స్ నచ్చకపోవడంతో ఆ చిత్రాలు విజయం సాధించలేకపోయాయి.

తెలుగులో అలాంటి  క్లైమాక్స్ వల్ల అపజయం పొందిన సినిమాల లిస్ట్ చూసినట్లయితే అందులో చాలా చిత్రాలే ఉంటాయి. మరి సినిమా బాగుండి కూడా వీక్ క్లైమాక్స్ కారణంగా ప్లాప్ గా నిలిచిన 6 సినిమాలు ఏమిటో చూద్దాం..
1.శీను:
విక్టరీ వెంకటేష్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ కన్నా హీరోయిన్ గా నటించిన చిత్రం శీను. ఈ మూవీలోని పాటలు హిట్ అయ్యాయి. హీరోహీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, కామెడీ అన్ని ఆడియెన్స్ ని అలరించాయి. ఇక హీరోయిన్ కు వెంకటేష్ మూగవాడిగా పరిచయమవుతాడు. ఆమె అతను మూగవాడు అని నమ్మడంతో ఆమె కోసం క్లైమాక్స్ లో నిజంగానే మూగవాడిగా మారిపోతాడు. క్లైమాక్స్ ప్రేక్షకులకు నచ్చకపోవడం వల్ల ఈ మూవీ ప్లాప్ అయ్యింది.
2.వేదం:
దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా వేదం. ఈ చిత్రం ఒక వర్గం ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. అయితే క్లైమాక్స్ లో అల్లు అర్జున్, మంచు మనోజ్ చనిపోవడంతో ఈ మూవీ ప్లాప్ గా నిలిచింది. క్లైమాక్స్ లో దర్శకుడు క్రిష్ మార్పులు చేస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యేదని అల్లు అర్జున్, మనోజ్ అభిమానులు భావించారు.
3.చక్రం:
కృష్ణవంశీ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చక్రం మూవీ కుడా ఫ్లాప్ అయిన విషయం అందరికి తెలిసిందే. దీనికి కారణం క్లైమాక్స్ లో హీరో చనిపోవడమే అనవచ్చు. ఇప్పటికీ చక్రం సినిమా టీవీలో వస్తే చూసే ప్రేక్షకులకు ఉన్నారు. ఇందులోని జగమంతా కటుంబం పాటకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
4.భీమిలి కబడ్డీ జట్టు:
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా భీమిలి కబడ్డీ జట్టు. ఈ చిత్రం మొదటి సీన్ నుండి ప్రీ క్లైమాక్స్ వరకు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. కానీ ఈ మూవీలో హీరో నాని క్యారెక్టర్ చనిపోవడంతో హిట్ అవ్వాల్సిన సినిమా కాస్తా ఫ్లాప్ అయ్యింది.
5.మెరుపు కలలు:
ప్రభుదేవా, బాలీవుడ్ హీరోయిన్ కాజోల్, అరవింద స్వామి కలయికలో వచ్చిన సినిమా మెరుపు కలలు. ఈ చిత్రం ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ క్లైమాక్స్ వల్ల ఫ్లాప్ గా నిలిచింది. ఈ మూవీ క్లైమాక్స్ లో హీరో అరవింద స్వామి ఫాదర్ గా మారడం ఆడియెన్స్ కి నచ్చలేదు.
6.నక్షత్రం:
కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్,సాయిధరమ్ తేజ్ లు హీరోలుగా నటించిన సినిమా నక్షత్రం. ఈ క మూవీలో సాయిధరమ్ తేజ్ క్యారెక్టర్ ను చంపేయడం అనేది మైనస్ గా మారింది.దాంతో ఈ సినిమా విజయం సాధించలేకపోయింది.
Also Read: బాహుబలి చిత్రంలో ఈ సీన్ ని ఎప్పుడైనా గమనించారా?

The post వీక్ క్లైమాక్స్ కారణంగా విజయం సాధించలేకపోయిన 6 తెలుగు సినిమాలు.. appeared first on Prathi Dvani - The Sound of Every Telugu Heart Beat.



This post first appeared on Latest Telugu News, please read the originial post: here

Share the post

వీక్ క్లైమాక్స్ కారణంగా విజయం సాధించలేకపోయిన 6 తెలుగు సినిమాలు..

×

Subscribe to Latest Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×