Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Vinayaka Chavithi pooja vidhanam Telugu

Vinayaka Chavithi Vratha Kalpam Telugu

Vinayaka Chavithi Vratha Kalpam Telugu Audio

Vinayaka Chavithi Vratha Kalpam Telugu

శ్రీ వరసిద్ది వినాయక పూజావిధానము.

శ్రీ వరసిద్ధి వినాయకవ్రతమునకు కావలసిన వస్తువులు:

పసుపు 25 గ్రా.
కుంకుమ 25 గ్రా.
పసుపు గణపతి
పార్ఠివగణపతి(మట్టితో చేసిన గణపతి)
పాలవెల్లి(అలంకారముతొ)
బియ్యం  అరకిలొ
తమలపాకులు 20
అగరవత్తులు  1 ప్యాకట్
ప్రత్తి(ఒత్తులకు,వస్త్రయుగ్మమునకు,
యజ్ణోపవీతమునకు)
దీపము(ఆవునేతితొగాని, కొబ్బరి
నూనెతొగాని)
పంచామృతములు(ఆవుపాలు, పెరుగు,నెయ్యి, తేనె, పంచదార నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు) గంధము, వక్కలు, అరపళ్ళు, బెల్లం 100 గ్రా, కొబ్బరికాయ
హారతి కర్పూరం
పార్థివ ప్రతిమా ప్రాశస్త్యము:
వినాయకుని ప్రతిమ మట్టిదే వాడవలెనా? ఏ రంగుది వాడవలెను? ఇవి అనేకుల ప్రశ్నలు. దీనికి గణేశ పురాణంలో సమాధానం కలదు.
శ్లోపార్థివీ పూజితామూర్తి:స్థ్రియావా పురుషేణవా ఏకాదదాతి సా కామ్యం ధన పుత్రి పశూనపి
పురుషుడు గాని, స్త్రీ గాని మట్టితో చేసినగణపతి ప్రతిమను పూజ చేసినచో ధన,పుత్ర, పశ్వాది సమస్త సంపదలను పొందగలరు.
ఆ ప్రతిమ ఎట్టిమతో చేయవలెను?
మృత్తికాం సుందరాం స్నిగ్ధాం క్షుద్ర పాషాణ వర్జితాం
శుభ్రం అయినది. మెత్తనిది, రాళ్ళు, ఇతర మాలిన్యములు లేనిది అగు మట్టిని స్వచ్చం అయిన నీటితో తడిపి  ప్రతిమచేయవలెను
శ్లోకృత్వా చారుతరాం మూర్తిం  ణేశస్య శుభాం స్వయం సర్వావయవ సంపూర్ణాం చతుర్భుజవిరాజితాం
నాలుగు చేతులు గల వినాయక ప్రతిమను స్వయముగ చేసుకొనవలెను. అయితే ఇది అందరికి సాధ్యం కానిది. ప్రతి పట్టణములోను అప్పటికప్పుడు మట్టిని అచ్చులో వేసి ప్రతిమను చేసి ఇచ్చు అంగళ్ళు వినాయకచవితి ముందురోజునుండే పెడుతున్నారు. అట్టి ప్రతిమ అన్నిటికన్న మంచిదని గణేశ పురాణమును బట్టి గ్రహించవలెను.
దూర్వాయుగ్మ పూజ:
వినాయకునికి అత్యంత ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వలు అనగా గరిక పోచలు.  గరిక అనగా గడ్డి ప్రతిచోట ఉండును.  చిగురులు కల గరికపోచలు వినాయకుని పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ అయినవి.  గణేశుడే స్వయంగా మత్పూజా భక్తినిర్మితా మహతీ స్వల్పికావాపివృధా దూర్వ్వంకురై ర్వినా అంటే నాకు భక్తితో చేసినపూజ గొప్పది అయినను, చిన్నది అయినను దూర్వాంకురములు లేకుండా చేసినచో అది వృధా కాగలదు.
వినా దూర్వాంకు రైపూజా ఫలంకేనాపి నాప్యతే
తస్మాదుషసి మద్భ  త్కై రేకా వాప్యేక వింశతి:
భక్త్యా సమర్పితా దూర్వా దదాతి యత్ఫలం మహత్
నతత్క్ర్ తుశతై  ర్దా నైర్వ తానుష్టాన సంచయై :
 దూర్వాంకురములు లేని పూజ వలన ఫలమేమియు కలుగదు.  అందుచే నాకు భక్తులగువారు ఉష:కాలమందు ఒకటి గాని, ఇరువది ఒకటి గాని దూర్వలచే పూజింవచినచో కలుగు ఫలితము వంద యజ్ఞములవలన గాని, దానముల వలన గాని, వ్రతముల వలన గాని, తపముల వలన గాని పొందుట సాధ్యము కాదు. “దూర్వాయుగ్మమం”  అంటే రెండేసి గరికపోచలు సమర్పించవలెను. ఒకటి ఒకటి విడదీయరాదు. శుభములు కలిగించునది, పుణ్యమును చేకూర్ఛునది అయిన కార్యములు  చేయునపుడు ఆటకములు లేకుండ ఆ కార్యము జరుగుటకు గణాధిపతిని ముందుగ పూజించవలెను.
వినాయకచవితి రోజున చేయు వినాయకవ్రతము ప్రముఖ శుభకార్యం కనుక ముందు పసుపుతో చేసిన గణపతిని పూజించవలెను.  పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచవలెను.  చిన్నపళ్ళెములో బియ్యం పోసి ఆ బియ్యముపై పసుపుతో చేసిన గణపతిని తమలపాకుతో సహా ఉంచవలెను. ఆకు కొన తూర్పునకు ఉండవలెను.  ఆవు నేతితో గాని, నూనెతో గాని దీపము వెలిగించి, గణపతికి నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.
శ్రీ మహాగణాధిపతయే నమశ్రీ గురుభ్యోనమహరిఓం
శ్లోశుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం   ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే.
 మం.  ఓం  దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాపశవోవదంతి సామోమంద్రేషమూర్జంయహానా ధేనుర్వాగస్మానం పసుష్టుతైతు
 అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు.
ఆచమనం:
 పాత్ర(అనగా చిన్న చెంబు లేక గ్లాసు) తో నీరు తీసుకొని ఉద్ధరిణి లేదా చెంచాతో ఆచమనం చేయవలెను.  బొటనవ్రేలి చివరను మధ్యవ్రేలి మధ్యకణుపునకు చేర్చి అరచేతిలో మినపగింజ మునిగేటంత నీటిని పోసుకుని ఆచమనం చేయవలెను.
ఓం కేశవాయ స్వాహా:  
 ఓం నారాయణాయ స్వాహా:  
 ఓం మాధవాయ స్వాహా :
 ( మూడు నామములు చెప్పుచూ కుడి చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను.)
ఓం గోవిందాయ నమ: (చేతిని కడుగ వలెను.)
ఓం  విష్ణవే నమఓం త్రివిక్రమాయ నమ:  ఓం వామనాయ నమఓం శ్రీధరాయ నమఓంహ్రుషీకేశవాయ నమఓం పద్మనాభాయ నమఓం దామోదరాయ నమ:
ఓం సంకర్షణాయ నమఓం వాసుదేవయ నమఓం ప్రద్యుమ్నాయ నమఓం పురుషోత్తమాయనమఓం అధోక్షోజాయ నమఓం అచ్యుతాయ నమఓం జనార్థనాయ నమఓం హరయే నమ:ఓం శ్రీ కృష్ణాయ నమ:
దైవ ప్రార్థన:
 (గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను.
శ్లో:  1.  యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాం


This post first appeared on HEALTH TIPS, please read the originial post: here

Share the post

Vinayaka Chavithi pooja vidhanam Telugu

×

Subscribe to Health Tips

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×