Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Renu Desai : పెళ్లి, రాజకీయ ప్రవేశంపై రేణుదేశాయ్ సంచలన ప్రకటన…

Renu Desai : ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకుంటూ ఇండస్ట్రీలో తనదైన మార్క్ నటనతో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.ఇక అలాంటి వాళ్లలో రేణుదేశాయ్ ఒకరు…ఈ క్రమంలోనే మొదట మోడల్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా తనదైన మార్కు చూపిస్తు దర్శకత్వం చేయాలనే ఉద్దేశ్యం తోనే తను ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ అనుకోకుండా పవన్ కళ్యాణ్ తీసిన బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ క్రమంలోనే ఆమె పవన్ కళ్యాణ్ తో ప్రేమ,పెళ్లి వ్యవహారాలు కూడా సాగించింది.ఇక ఇలాంటి క్రమంలోనే ఇద్దరు పిల్లలకు జన్మని కూడా ఇచ్చింది.వాళ్లే ఒకరు అఖీరా నందన్ కాగా, ఇంకొకరు ఆధ్యా… ఇక ఇలా లైఫ్ సాఫీగా సాగుతుంది అని అందరూ అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల వ్యవహారం విడాకులు తీసుకునే వరకు వెళ్లింది. అయితే వీళ్ళ మధ్య ఏం గొడవలు జరిగాయి అనే విషయం మీద స్పష్టత లేదు. కానీ ఇద్దరు విడిపోయి ఒకరికొకరు దూరంగా బతుకుతున్నారు.

ఇలాంటి క్రమంలో పవన్ మూడో పెళ్లి చేసుకున్నాడు… ఇక రేణు దేశాయ్ మాత్రం ఇద్దరు పిల్లలను చూసుకుంటూ కెరియర్ ని ముందుకు తీసుకెళ్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె రీసెంట్ గా రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో సామాజిక కార్యకర్త హేమలత లవణం అనే పాత్ర పోషించి తనదైన నటనతో ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను చూరగొంది. ఇక ఈమె రీసెంట్ గా ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈమెను తన రెండో పెళ్లి గురించి అడిగితే దానిమీద ఆమె స్పందిస్తూ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదనే స్పష్టతనిచ్చింది.

ఇక ఆ ఇంటర్వ్యూలో రిపోర్టర్ మీరు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని అడగగా రాజకీయాలు అనే పదంలోనే ఒక నెగిటివిటీ ఉంది.అందుకే ఏ తల్లిదండ్రులు అయిన కూడా వాళ్ల పిల్లలని రాజకీయాలలోకి పంపించాలి అని అనుకోవడం లేదు.ఏ తల్లిదండ్రుల అయిన కూడా తమ కొడుకు డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ కావాలని కోరుకుంటారు కానీ తన కొడుకు రాజకీయ నాయకుడు అవ్వాలని ఏ తల్లిదండ్రులు అనుకోవడం లేదు అంటే వాళ్ళ ఆలోచనలోనే రాజకీయం అనేది కరెక్టు పరిస్థితుల్లో లేదు,అదొక దుర్భరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా తన కొడుకుల్ని రాజకీయ నాయకులు చేయాలని అనుకోవడం లేదు. ఇలాంటి క్రమంలో నాకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యం అయితే లేదు కానీ సేవ చేయాలనే ఉద్దేశ్యంలో అయితే ఉన్నాను. నా పరిధిలో ఉన్నంతవరకు నేను చాలా మందికి సహాయం చేసే విధంగానే ముందుకు వెళుతున్నాను అంటూ సమాధానం చెప్పింది…

Share the post

Renu Desai : పెళ్లి, రాజకీయ ప్రవేశంపై రేణుదేశాయ్ సంచలన ప్రకటన…

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×