Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Bigg Boss 7 Telugu: ఆ తప్పు చేసి పెద్ద ప్రమాదంలో పడ్డ అమర్… నాగార్జున వేసే శిక్ష ఏమిటీ?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఏడో వారం చివరి దశకు వచ్చేసింది. ఇక ఈ రోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇక సీరియస్ గా కంటెస్టెంట్స్ చేసిన తప్పులు గుర్తుచేస్తూ ఒక్కొక్కరికి ఇచ్చి పడేశాడు. బిగ్ బాస్ హౌస్ లో కొన్ని కుండ బద్దలు కొట్టాల్సిన నిజాలున్నాయి అని స్టార్ట్ చేశాడు.ఇక ముందుగా అశ్విని ని ఎందుకు చేశావమ్మా అలా? అని నాగార్జున అడిగారు. ఏం చేశాను సార్? అని అశ్విని అమాయకంగా అడిగింది. దీంతో నాగార్జున ‘ఏం చేశావో నీకు తెలియదా ..ఒక్కోసారి నువ్వు అనే మాటలు ‘ రేయ్.. పోరా’ అని వస్తున్నాయి అని అన్నారు.

ఇక ఆ తర్వాత భోలే కుండ పగలగొట్టిన నాగార్జున మన ఊరిలో మనం వాడుకునే పదాలు ఉండవచ్చు. ఎర్రగడ్డ ఏ ఫ్లో లో వచ్చింది అని నిలదీశాడు. దీనికి భోలే ఆమె సెన్స్ లెస్ అంది సార్ అని చెప్పాడు. సెన్స్ లెస్ కి మెంటల్ కి చాలా తేడా ఉంది. నీకు తెలియదా అని అన్నారు నాగార్జున. తర్వాత ప్రియాంకను లేపి కొన్నిసార్లు మాటలు అనేసి సారీ చెప్తే సరిపోదు అని అనగానే ప్రియాంక నోట మాట రాలేదు.

అమర్ కేక్ తిన్నపుడు బిగ్ బాస్ కి ఎందుకు కంప్లైంట్ చెయ్యలేదు. ఏంటీ గ్రూపిజమా? అని శోభా పై ఫైర్ అయ్యాడు. ఇక ఆ తర్వాత అమర్ ని లేపి అంత ఆత్రంగా కేక్ తినడం అవసరమా,నువ్వు చేసిన పనికి ఎంత పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నావో తెలుసా అని నాగార్జున అన్నారు. దీంతో అమర్ కి ఫీజులు ఎగిరిపోయాయి. తేజ నువ్వు అందరిని రెచ్చగొడుతున్నావు శాడిజం లాగా ఉంది అని అన్నాడు నాగ్.

ఆ తర్వాత ప్రశాంత్ తో… సందీప్ ఒట్టేసినప్పుడు నువ్వు ఎందుకు వేయలేదు. ఒకరి మీద నింద వేసేటప్పుడు నిజమై ఉండాలి. అసలు ఊరోడు అనడం తప్పా? అందరూ ఊరు నుంచే వచ్చారు.అందరికి తిండి పెట్టేది ఊరే.. నేను గర్వంగా చెబుతున్నాను మా నాన్న ఊరోడు. అందులో తప్పేమీ లేదు అని నాగార్జున చెప్పాడు. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో ఇలాంటి ఆసక్తికర అంశాలతో కూడుకొని ఉంది. పూర్తి ఎపిసోడ్ చూస్తే నాగార్జున ఎవరిని పొగిడాడో? ఎవరిని తిట్టాడో? తెలియదు…

Share the post

Bigg Boss 7 Telugu: ఆ తప్పు చేసి పెద్ద ప్రమాదంలో పడ్డ అమర్… నాగార్జున వేసే శిక్ష ఏమిటీ?

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×