Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Cheaper Cars : ధర తక్కువ అని ఈ 5 కార్ల కోసం ఎగబడుతున్నారు.. అవేంటో తెలుసా?

Cheaper Cars : దేశీయంగా కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తుంది మారుతి సుజుకీ. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన చాలా మోడల్స్ ఇప్పటికే వినియోగదారులను విపరీతంగా ఆకర్షించాయి. ఎప్పటికప్పడు అప్డేట్ ఫీచర్స్ తో అందుబాటులోకి తెస్తున్న కొత్త కార్లను వినియోగదారులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కంపెనీకి చెందిన కొన్ని కార్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. మంచి మైలేజ్ ఇవ్వడంతో పాటు తక్కువ ధరకే అందించే ఎన్నో కార్లు సక్సెస్ అయ్యాయి. అయితే గత సెప్టెంబర్ నెలలో మాత్రం 5 కార్లు అత్యధికంగా అమ్ముడు పోయాయి. ఆ కార్ల వివరాల గురించి తెలుసుకుందాం..

మారుతి నుంచి రిలీజై అత్యంత ఆదరణ పొందిన మోడల్ బాలెనో. ఈ మోడల్ ధర రూ.6.61 లక్షలు ఉంది. గతేడాది సెప్టెంబర్ నెలలో ఈ మోడల్ 19,369 యూనిట్లు విక్రయం జరుపుకుంది.ఈ ఏడాది 18,417 యూనిట్లు అమ్మారు. వార్షిక ప్రాతిపదికగా అమ్మకాలు క్షీణించినా.. ఈ ఏడాదిలో అత్యధికంగా సేల్స్ అయింది మాత్రం బాలెనో అని చెప్పొచ్చు. బాలెనో తరువాత అత్యధికంగా అమ్మకాలు జరుపుకున్న మరో మోడల్ వ్యాగన్ ఆర్. కారుపై మనసుపడ్డ వారు ముందుగా వ్యాగన్ ఆర్ గురించే ఆలోచిస్తారు. ఈ క్రమంలో ఈ కారు ఈ ఏడాది సెప్టెంబర్ లో 16,250 యూనిట్ల విక్రయం జరుపుకుంది. గతేడాది ఇదే నెలలో 20,078 యూనిట్లు అమ్మారు.

టాటా కంపెనీ సైతం వినియోగదారులను ఆకర్షించే ఎన్నో మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా నెక్సాన్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 15,325 యూనిట్ల విక్రయం జరుపుకుంది. గతేడాది ఇదే నెలలో 14,518 యూనిట్లు అమ్మారు. ఈ కారు కూడా వార్షిక సేల్స్ తగ్గినా ఈ ఏడాదిలో మాత్రం అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో నిలిచింది. మారుతి నుంచి మరో కారు బ్రెజ్జా అమ్మకాల్లో 4వ స్థానంలో ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ మోడల్ 15,001 యూనిట్లు విక్రయించింది.

మారుతి లో ది బెస్ట్ కారుగా నిలిచింది స్విప్ట్. మైలేజ్ తో కూడుకొని తక్కువ ధరకే అందించే ఈ మోడల్ గత సెప్టెంబర్ నెలలో 14,703 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది 11,988 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. అయితే స్విప్ట్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 23 శాతం వృద్ధిని సాధించాయి. మొత్తంగా మారుతి కంపెనీ నుంచి విడుదలయిన కార్లు ఎక్కువగా విక్రయాలు నమోదు చేసుకోవడం విశేషంగా చెప్పొచ్చు.

Share the post

Cheaper Cars : ధర తక్కువ అని ఈ 5 కార్ల కోసం ఎగబడుతున్నారు.. అవేంటో తెలుసా?

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×