Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Bigg Boss 7 Telugu Ashwini: బిగ్ బాస్ అశ్విని నటించిన మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా?

Bigg Boss 7 Telugu Ashwini: రెండు వారాల క్రితం బిగ్ బాస్ సీజన్ 7 రీలాంచ్ ఈవెంట్ జరిగింది. ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అర్జున్ అంబటి, అశ్వినిశ్రీ,భోలే, నయని పావని, పూజా మూర్తిలను నాగార్జున ఆహ్వానించాడు. సాదరంగా ఇంట్లోకి పంపారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కొందరు సెలెబ్స్ గురించి అందరికీ తెలియదు. వాళ్ళను మనం చాలా సినిమాల్లో చూసి ఉంటాం. వారు చేసినవి చిన్న చిన్న పాత్రలు కావడంతో మైండ్ లో రిజిస్టర్ కారు.

రతికా రోజ్ గతంలో కొన్ని సినిమాల్లో నటించింది. అయినా బిగ్ బాస్ హౌస్ కి వచ్చే వరకు తెలియదు. అక్టోబర్ 19న ఆమె నటించిన భగవంత్ కేసరి విడుదలైంది. ఆ చిత్రంలో మహిళా మంత్రిగా చిన్న పాత్రలో కనిపించింది. ఆడియన్స్ ఈలలు వేశారు. బిగ్ బాస్ షోతో వచ్చే పాపులారిటీ అలాంటిది మరి. మోస్ట్ కన్నింగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న రతికా రోజ్ అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుని ఎలిమినేట్ అయ్యింది.

ఇక అశ్విని విషయానికి వస్తే ఆమె కూడా గతంలో చాలా చిత్రాల్లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు చేసింది. వాటిలో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ రష్మిక మందాన అక్క పాత్ర చేసింది అశ్విని. ఈ చిత్రంలో సంగీత రష్మిక తల్లిగా చేసింది. రష్మిక అక్క పాత్రల్లో హరితేజ, అశ్విని నటించారు.

మహేష్ బాబుతో రష్మిక, సంగీత, హరితేజల ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్ గా ఉంటుంది. ఆ సన్నివేశాల్లో అశ్విని కూడా ఉంది. ఇప్పుడు అశ్విని బిగ్ బాస్ హౌస్లో ఉండగా ఆమె నటించిన చిత్రాలకు సంబంధించిన సీన్స్ వైరల్ అవుతున్నాయి. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ కొట్టింది. మహేష్ కెరీర్ హైయెస్ట్ వసూళ్లు నమోదు చేసింది.

Share the post

Bigg Boss 7 Telugu Ashwini: బిగ్ బాస్ అశ్విని నటించిన మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా?

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×