Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Leo Twitter Review: లియో ట్విట్టర్ రివ్యూ: ఫస్ట్ హాఫ్ అలా సెకండ్ హాఫ్ ఇలా… విజయ్ అంచనాలు అందుకున్నాడా?

Leo Twitter Review: ఈ మధ్య కాలంలో విడుదలైన విజయ్ చిత్రాల్లో అత్యంత హైప్ నెలకొన్న చిత్రం లియో. కాంబినేషన్ రీత్యా జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. విజయ్ వంటి భారీ అభిమాన గణం ఉన్న హీరో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మూవీ అనగానే ఇండియా వైడ్ ఆసక్తి నెలకొంది. అది అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా లియోకి ఎంత డిమాండ్ ఏర్పడిదంటే… బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రం కంటే ఎక్కువ బుకింగ్స్ లియోకి నడిచాయి. మరి ఇంత హైప్ మధ్య విడుదలైన లియో ఎలా ఉంది…

దసరా కానుకగా లియో అక్టోబర్ 19న విడుదల చేశారు. యూఎస్ ప్రీమియర్స్ ఇప్పటికే ముగిశాయి. ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే. అందుకే ఆయన ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వాలంటే విక్రమ్ ఓ సారి చూడాలి అన్నారు. అయితే లియో ట్రైలర్ అలా అనిపించలేదు. కానీ లియో ఖైదీ, విక్రమ్ చిత్రాలతో ముడిపడిన సినిమా…

ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కథను ఎస్టాబ్లిష్ చేసేందుకు లోకేష్ కనకరాజ్ కొంత సమయం తీసుకున్నాడు. ఈ క్రమంలో కథనం నెమ్మదిగా సాగుతుంది. హైనా తో యాక్షన్ ఎపిసోడ్ అలరిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ నాటికి సినిమా పికప్ అవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, బ్యాంగ్ అదిరింది. సెకండ్ హాఫ్ లియో దాస్ తో మొదలవుతుంది. లియో దాస్ తో కూడిన సన్నివేశాలు మెప్పిస్తాయి. తర్వాత కథనం మరలా స్లో అవుతుంది.

ప్రీ క్లైమాక్స్ కి సినిమా రేసీ స్క్రీన్ ప్లే తో సాగుతుంది. టర్న్స్ అండ్ ట్విస్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. రెండు రకాల గెటప్స్ లో విజయ్ పెర్ఫార్మన్స్ అద్భుతం. ఆయన ప్రెజెన్స్, మాస్ మేనరిజమ్స్ ఫ్యాన్స్ కి ట్రీట్. ఇక లోకేష్ కనకరాజ్ యూనివర్స్ తో లింక్ చేస్తూ రాసుకున్న సన్నివేశాలు మెప్పిస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సినిమా టెక్నికల్ గా టాప్ నాచ్. అర్జున్, సంజయ్ దత్ సినిమాకు ప్లస్ అయ్యారు. త్రిష తన పాత్ర మేర ఆకట్టుకుంది.

ప్రధానంగా అనిరుధ్ బీజీఎం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరోసారి సత్తా చాటాడు. మొత్తంగా లియో అలరించే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. అయితే విక్రమ్, ఖైదీ రేంజ్ లియోలో లేదు. ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ లోకేష్ కనకరాజ్ అద్భుతం అనిపించలేకపోయాడు.

Share the post

Leo Twitter Review: లియో ట్విట్టర్ రివ్యూ: ఫస్ట్ హాఫ్ అలా సెకండ్ హాఫ్ ఇలా… విజయ్ అంచనాలు అందుకున్నాడా?

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×