Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gold Prices: నేడు (2023 అక్టోబర్ 14న) బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Gold Prices: బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. పండుగల సీజన్ లోనూ బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. అక్టోబర్ 14న శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. అక్టోబర్ 14న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.54,00గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.58,910 గా ఉంది. అక్టోబర్ 12న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.54,000తో విక్రయించారు. శుక్రవారం కంటే శనివారం బంగారం స్వల్పంగా తగ్గింది.

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,060గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.54,000 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.58,910 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,100 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,110తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.54,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.58,910తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,000తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.58,910తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు స్వల్పంగా తగ్గినా వెండి ధరలు పెరిగాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.72,600గా నమోదైంది. శుక్రవారం తో పోలిస్తే శనివారం వెండి ధరల్లో రూ.1000 మేర పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.72,600గా ఉంది. చెన్నైలో రూ.77,000, బెంగుళూరులో 71,500, హైదరాబాద్ లో రూ.77,000తో విక్రయిస్తున్నారు.

Share the post

Gold Prices: నేడు (2023 అక్టోబర్ 14న) బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×