Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Prakash Raj – Disco Shanti : ప్రకాష్ రాజ్, శ్రీహరికి ఏం అవుతాడు.. డిస్కో శాంతి ప్రకాష్ రాజ్ కి చేసిన సహాయం ఏంటంటే..?

Prakash Raj – Disco Shanti : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటలలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఈయన విలక్షణమైన నటనకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది.ఇక ఈయన మొదట్లో తమిళ్ సినిమా ల్లో నటించినప్పటికీ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలతో నటించి నటుడు గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి సందర్భంలోనే చాలామంది డైరెక్టర్లు ఆయనకి వరసగా ఆఫర్లు ఇవ్వడంతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఈయన చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమాలో వన్ ఆఫ్ ది విలన్ గా నటించడమే కాకుండా ఆ పాత్రలో జీవించాడు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన చూడాలని ఉంది సినిమాలో మెయిన్ విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును చాటుకున్నాడు.

అయితే ఆయనకు మొదట్లో అవకాశాలు లేని సమయంలో సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసే డిస్కో శాంతి ద్వారా ఆయనకి అవకాశాలు రావడం జరిగింది.ఇక డిస్కో శాంతి వాళ్ళ సిస్టర్ ని ప్రకాష్ రాజ్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఇలాంటి సమయంలోనే ఆయనకి వరుసగా సినిమా అవకాశాలు రావడం అలాగే తన సినిమా కెరియర్ కూడా పీక్స్ లో ఉండడం వల్ల ఆయన టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు పొందాడు. అలాగే ఆయన వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతూ ఉండేవాడు. అయితే ఈ క్రమంలోనే డిస్కో శాంతి, శ్రీహరిని పెళ్లి చేసుకుంది.

అలా శ్రీహరి,ప్రకాష్ రాజ్ ఇద్దరు తోడు అల్లుళ్లు అయ్యారు. శ్రీహరి కూడా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు కొనసాగాడు అలాగే ఆయన హీరోగా భద్రాచలం లాంటి సినిమాల్లో నటించి సక్సెస్ లు అందుకున్నాడు. ఇంకా దీనికి తోడుగానే నటులుగా అయితే వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో కూడా నటించడం జరిగింది.ముఖ్యంగా బృందావనం సినిమాలో అన్నదమ్ములుగా నటించి మంచి నటన ని కనబరిచారు. ఇక వీళ్ళిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. శ్రీహరి గత కొన్ని సంవత్సరాలు క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది…అలా శ్రీహరి,ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా తోడు అల్లుళ్లు అవుతారు… ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వరుసగా సినిమా చూస్తూ మంచి జోష్ మీద ఉన్నాడు.అయితే శ్రీహరి చనిపోయే కొన్ని రోజుల ముందు శ్రీహరి కి ప్రకాష్ రాజ్ లకి మధ్య కొన్ని గొడవలు జరిగినట్టు గా కూడా తెలుస్తుంది…

Share the post

Prakash Raj – Disco Shanti : ప్రకాష్ రాజ్, శ్రీహరికి ఏం అవుతాడు.. డిస్కో శాంతి ప్రకాష్ రాజ్ కి చేసిన సహాయం ఏంటంటే..?

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×