Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Boyapati Srinu On Mahesh Babu: మహేష్ తో అలాంటి సినిమా చేస్తానన్న బోయపాటి.. ఫ్యాన్స్ కు పండుగే…

Boyapati Srinu On Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తీసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి.ఇక మాస్ సినిమాలను ఎలా తీయాలో ఆయనకి తెలిసినంత గొప్పగా మరే డైరెక్టర్ కి తెలియదనే చెప్పాలి. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా ఈయనను అభివర్ణించవచ్చు . అయితే రీసెంట్ గా బోయపాటి శ్రీను స్కంద సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు దాంట్లో భాగంగానే ఈమధ్య ఆయన ఒక ఇంటర్వ్యూ లో మహేష్ బాబు గురించి ప్రస్తావిస్తూ మహేష్ బాబు మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు..

అవి ఏంటి అంటే మహేష్ బాబు ఇండస్ట్రీలో చాలా గొప్ప నటుడు అన్ని క్యారెక్టర్లు చేయగలడు క్లాస్, మాస్ అని తేడా లేకుండా ఏ క్యారెక్టర్ అయిన సరే అలవోకగా చేసి మెప్పించగల అతి కొద్ది మంది నటుల్లో మహేష్ బాబు ఒకరు.ఆయనతో ఒక మంచి కమర్షియల్ సినిమాని చేయాలని ఉంది. ఇప్పటికే ఆయనకి కథ కూడా వినిపించాను ఆ సినిమా కూడా త్వరలోనే ఉంటుంది ఆయనకు నాకు కొంచెం వేరే సినిమాల వల్ల గ్యాప్ వస్తుంది అంతే తప్ప ఇంకేం లేదు పక్కగా మా కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అంటూ ఆయన చెప్పారు.

ఇక ఇప్పటికే లెజెండ్ సినిమా తర్వాత మహేష్ బాబు కి బోయపాటి ఒక కథ చెప్పారు. ఆయన అప్పుడు కొంచెం బిజీగా ఉండడంవల్ల ఆ సినిమా చేయలేక పోయారు.ఆ స్టోరీని సరైనోడు సినిమా పేరుతో బోయపాటి అల్లు అర్జున్ తో చేశాడు అనే టాక్ అప్పట్లో బాగా వినిపించింది. మళ్లీ ఇప్పుడు కూడా మహేష్ బాబు బోయపాటి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది.ఇక దానికి తగ్గట్టుగానే బోయపాటి శ్రీను ఇంటర్వ్యూ ఇచ్చారు ఇలా బోయపాటి మహేష్ బాబు కాంబో ఎప్పుడు సెట్ అవుతుందా అని చాలామంది ఆడియోన్స్ ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఎందుకంటే బోయపాటి చాలా మాస్ ఎలివేషన్స్ ఇస్తూ ఒక హీరో ని చూపిస్తాడు కాబట్టి ఆయన డైరెక్షన్ లో నటించాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటాడు అయితే బోయపాటి మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గకథ రెడీ గా ఉంది అయినప్పటికీ మహేష్ బాబుకి ఉన్న కొన్ని కమిట్ మెంట్స్ వల్ల ఈ సినిమా లేట్ అవుతుంది అని.తెలుస్తుంది. ఇక ఇప్పుడు బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…

Share the post

Boyapati Srinu On Mahesh Babu: మహేష్ తో అలాంటి సినిమా చేస్తానన్న బోయపాటి.. ఫ్యాన్స్ కు పండుగే…

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×