Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gurmeet Choudhary: వీధిలో కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్ చేసి కాపాడిన నటుడు!

Gurmeet Choudhary: ఇటీవల కాలంలో గుండెలు సడెన్ గా ఆగిపోతున్నాయి. వ్యాయామం చేస్తూ, డ్యాన్సులు చేస్తూ.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారు సైతం అకస్మాత్తుగా కుప్పకూలుతున్నారు. గుండెపోటుతో చనిపోతున్నారు. సరైన టైంలో వారికి సేపీఆర్ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్) అందిన వారు ప్రాణాలతో బయట పడుతున్నారు. ఇలాంటి ఘటనలు కూడా కొన్ని చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది. ముంబైలో రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి నటుడు గుర్మీత్ చౌదరి సీపీఆర్ అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

నెట్టుంట్లో వైరల్..
టీవీ, సినీ నటుడు గుర్మీత్ చౌదర్ ముంబయి వీధిలో కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. గుర్మీత్ చౌదరిని అందరు ప్రశంసిస్తున్నారు. గుర్మీత్ సీపీఆర్ అందించడంతోపాటు స్ట్రెచర్ పైకి తీసుకెళ్లడానికి కూడా సాయం చేసారు. వీడియో చూసిన నెటిజన్లు మానవత్వం ఉన్న నటుడు అని.. రియల్ హీరో అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సోషల్ మీడియాలో యాక్టిివ్ గా..
గుర్మీత్ చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన లైఫ్‌కి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల గుర్మీత్ భార్య దేవీనా బోనర్జీతో కలిసి గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

Share the post

Gurmeet Choudhary: వీధిలో కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్ చేసి కాపాడిన నటుడు!

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×