Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Amy Jackson: గుర్తుపట్టలేకుండా మారిపోయిన ఐ మూవీ హీరోయిన్.. ఇప్పుడు చూస్తే అవాక్కే.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

Amy Jackson: అమీ జాక్సన్‌.. పేరు గుర్తుందా.. పోనీలే.. ఐ సినిమా హీరోయిన్‌ గుర్తుందా.. యస్‌.. అమే అమీ జాక్సన్‌. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌. తమిళ్‌ హీరో విక్రమ్‌ నటించిన ఐ సినిమాతో సౌత్‌ ఇండియాలో బాగా పాపులర్‌ అయింది. తెలుగు హీరోయిన్‌ కానప్పటికీం మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ అమ్మడుకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. కెరీర్‌ ప్రారంభంలో మోడల్‌గా ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్‌.. తర్వాత హీరోయిన్‌గా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది.

తమిళ, తెలుగు సినిమాల్లో..
2010 సంవత్సరంలో తమిళంలో ఒక సినిమా చేసి హీరోయిన్‌గా పరిచయమైంది అమీ జాక్సన్‌. ఆ తర్వాత 2014లో ఎవడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది ఈ బ్యూటీ. అయితే ఐ మనోహరుడు సినిమా తోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.. ఫాలోయింగ్‌ పెరిగింది. అలాగే తెలుగులో అధినేత్రి సినిమా కూడా చేసింది ఈ బ్యూటీ.

వింత గెటప్‌లో దర్శనం..
ఇది ఇలా ఉండగా తాజాగా హీరోయిన్‌ అమీ జాక్సన్‌ వింత గెటప్‌లో కనిపించింది. జుట్టు పూర్తిగా కత్తిరించుకుని దర్శనమిచ్చిన హీరోయిన్‌ అసలు ఎవరు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఇక ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ తమకు నచ్చినట్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఐ సినిమాలో విక్రమ్‌కు అన్యాయం చేసినందుకు నీ ముఖం ఇలా మారిపోయింది అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

View this post on Instagram

A post shared by Amy Jackson (@iamamyjackson)

Share the post

Amy Jackson: గుర్తుపట్టలేకుండా మారిపోయిన ఐ మూవీ హీరోయిన్.. ఇప్పుడు చూస్తే అవాక్కే.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×