Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Balakrishna : బావ చంద్రబాబు కోసం బాలయ్య తపన

Balayya : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో ఈరోజు పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, లోకేష్ భేటీ కానున్నారు. ముఖ్యంగా టిడిపి, జనసేన పొత్తు అధికారికం కానున్నట్లు తెలుస్తోంది. పవన్ తో పాటు బాలకృష్ణ సినిమాలకు బ్రేక్ చెప్పి.. ప్రజల్లోకి వచ్చేందుకురంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ అంశం ఏపీలో పొలిటికల్ పెంచుతోంది.

బాలకృష్ణ కొద్దిసేపటి కిందటే మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది గంటల్లో పవన్ సైతం రాజమండ్రి చేరుకోనున్నారు. ఈనెల 19 తర్వాతనే చంద్రబాబు బెయిల్ విషయంలో ఒక క్లారిటీ రానుంది . అయితే అంతకంటే ముందుగానే దిశా నిర్దేశం చేసేందుకు చంద్రబాబు ప్రత్యేక వ్యూహాల రూపొందించుకున్నట్లు సమాచారం. నిర్దేశించిన సమయానికి పవన్, బాలకృష్ణ, లోకేష్ లు చంద్రబాబుతో మూలాఖత్ కానున్నారు. ఆ సమయంలో భవిష్యత్తు రాజకీయ కార్యచరణ పైన చంద్రబాబు ఆ ముగ్గురికి దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అటు కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు పైన చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 16న హైదరాబాద్కు అమిత్ షా రానున్న నేపథ్యంలో.. ఆయనతో భేటీకి పవన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

బాలకృష్ణ గత మూడు రోజులుగా పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉన్నారు. ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు చంద్రబాబు కేసు సంగతులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ తరుణంలో బాలకృష్ణ నేరుగా రంగంలోకి దిగడం విశేషం. రాజమండ్రి వచ్చిన వెంటనే బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోదరి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి దంపతులను కలుసుకొని కీలక చర్చలు జరిపారు. పవన్ వచ్చిన వెంటనే.. లోకేష్ తో కలిసి చంద్రబాబుతో మూలాఖత్ అయ్యారు. . ఈ తరుణంలో రాజమండ్రిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు జైలు వద్ద సైతం పోలీసులు భారీగా మోహరించారు.

Share the post

Balakrishna : బావ చంద్రబాబు కోసం బాలయ్య తపన

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×