Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Scorpion Venom: తేలు విషం రూ.82 కోట్లు.. ఈ బిజినెస్ చేయండి.. కోటీశ్వరులైపోతారు

Scorpion Venom: ఏ వన్యప్రాణుల్ని, లేదా క్రూరమృగాలను పెంచిన రాని ఆదాయం.. విషపూరితమైన కీటకాలను పెంచితే వస్తుందనే వార్త ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అసలు విష కీటకాలను ఎవరు పెంచుకుంటారు..? వాటి నుంచి విషం ఎలా తీస్తారు.. అమ్మితే ఎంత లాభం వస్తుందనే సందేహాల్ని పక్కనపెట్టేలా వాటి పెంపకం కూడా జరుగుతోంది.

తేళ్లతో భారీ లాభం..
కోళ్లు పెంచినట్లుగానే తేళ్లను పెంచుతున్నారంటే దాని వెనుక ఎంత సీక్రెట్‌ దాగివుందో అర్ధం చేసుకోండి. నిజమే తేళ్లలో ఉండే విషం అత్యంత ఖరీదైనదనిగా తేలడంతో ఇప్పుడు తేళ్ల ఫారాలుగా మార్చి అందులో పెంచుతున్నారు. తేలు విషానికి మార్కెట్‌లో భారీగా డిమాండ్‌ ఉండటం వల్లే ఈతరహాలో తేళ్ల పెంపకం పరిశ్రమలు వెలసినట్లుగా తెలుస్తోంది.

లీటరుకు రూ.82 కోట్లు..
తేలు విషం ధర ఎంతంటే.. లీటర్‌కు రూ.82 కోట్లు పలుకుతోంది. అందుకే తేళ్లను శ్రద్దగా పెంచుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో తేళ్లను పెంచేందుకు ఓ పరిశ్రమలా ఫారంలో పెంచుతున్న వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. అందులో తేళ్లు చీమల్లా కనిపిస్తున్నాయి. వాటి ఆహారం, నివాసం కోసం అవసరమైన అన్నీ ఏర్పాట్లు చేసినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పడు ఈవీడియోనే లక్షల వ్యూస్‌ సొంతం చేసుకుంది.

ఇంత డిమాండ్‌ ఎందుకంటే..
తేలు విషానికి ఇంత డిమాండ్‌ పెరగడానికి కారణం ఈ తేళ్ల విషాన్ని కాస్మోటిక్‌ ప్రొడక్ట్స్, కొన్ని రకాల మెడిసిన్స్‌ తయారీలో ఉపయోగిస్తున్నారట. మరీ ముఖ్యంగా ప్రాంతాక వ్యాధిగా మారిన క్యాన్సర్‌ రోగం నయం చేయడానికి కూడా ఈ తేలు విషాన్ని ఉపయోగిస్తారట. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తేళ్లను పెంచుతున్నారు. ఇక వాటి విషాన్ని ప్రత్యేక పద్దతుల్లో నిల్వ చేస్తున్నారు.

విషం తయారీ కూడా రిస్కే..
కోట్ల రూపాయలు ధర పలుకుతున్న తేళ్ల విషం తయారు చేయడంలో కూడా అంతే రిస్క్‌ ఉందని వీడియో చూస్తే అర్ధమవుతోంది. ఒక్కొక్క తేలు నుంచి రోజుకు 2 మిల్లీ లీటర్ల విషం ఉత్పత్తి అవుతోందట. ఇలా ఉత్పత్తి అయిన విషాన్ని తేలు కొండిలోంచి ట్వీజర్స్‌తో పిండి బయటకు తీస్తున్నారు. అయితే ఇలా తేలు నుంచి విషాన్ని తీసే క్రమంలో దాని ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేక పద్ధ్దతిని అనుసరిస్తున్నారు.

పెపకం భయంకరంగా..
తేళ్లు.. వాటి విషం సంగతి పక్కన పెడితే వాటి అసలు వాటి పెంపకం విధానం చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఒకటి రెండు కాదు చీమల్లా వేల సంఖ్యలో తేళ్లను ఓ గదిలో పెంచుతున్న వీడియో చూసి నెటిజన్లే అవక్కై ముక్కు మీద వేలేసుకుంటున్నారు. డిఫరెంట్‌గా కామెంట్స్‌ షేర్‌ చేస్తున్నారు. అయితే ఈ ప్రయోగం అంతా ఎక్కడ జరుగుతుందో తెలియదు.

Share the post

Scorpion Venom: తేలు విషం రూ.82 కోట్లు.. ఈ బిజినెస్ చేయండి.. కోటీశ్వరులైపోతారు

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×