Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Sleepwell- Karlon: ఇక ఆ ప్రఖ్యాత పరుపులు కనిపించవు.. భారీ డీల్ కు అమ్మకం

Sleepwell- Sheila Phom Karlon: దేశీయ ఫర్నిచర్‌ దిగ్గజ కంపెనీ షీలా ఫోమ్‌.. తన ప్రత్యర్థి కర్లాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో 94.66 శాతం వాటాను ఈక్విటీ వాల్యుయేషన్‌ రూ.2,150 కోట్లకు కొనుగోలు చేసింది.ఇదేసమయంలో పుర్లెన్‌కో ఫర్నిచర్‌ కంపెనీలో 35 శాతం వాటాను రూ.300 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మేరకు జరిగిన ఒప్పందాన్ని షీలా ఫోమ్‌ సంస్థ ధ్రువీకరించింది. ఈ లావాదేవీ ద్వారా షీలా ఫోమ్‌ కంపెనీలో మొత్తం 3.46 కోట్ల ఈక్విటీ షేర్లను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ కొనుగోలు 2023 నవంబర్‌ 30 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. అధికారి ప్రకటనకు ముందు మనీ కాంట్రోల్‌ ఈ డీల్‌ గురించి వెల్లడించింది.

1962లో స్థాపన..
కర్లాన్‌ సంస్థలో మెజారిటీ వాటాను షీలా ఫోమ్‌ కొనుగోలు చేస్తోంది. 1962లో ఈ కంపెనీ స్థాపించబడింది. ప్రధానంగా తయారీ, మార్కెటింగ్‌లో డీల్‌ చేస్తుంది. ‘సిట్‌ అండ్‌ స్లీప్‌’ కేటగిరీలలో స్పాంజ్, కొబ్బరి ఆధారిత గృహ సౌకర్య ఉత్పత్తులు తయారు చేస్తుంది. ఎఫ్‌వై20లో కంపెనీ రూ.996 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఎఫ్‌వై21లో రూ.767 కోట్లు, ఎఫ్‌వై22లో 809 కోట్ల టర్నోవర్‌ నమోదైంది. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి ఫుర్లెంకోలో నియంత్రణ వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఎక్సే్ఛంజ్‌ ఫైలింగ్‌లో, ‘కస్టమరీ వర్కింగ్‌ క్యాపిటల్‌ మరియు ఇతర సర్దుబాట్లకు లోబడి, లక్ష్యం యొక్క 35 శాతం షేర్‌ క్యాపిటల్‌లో 300 కోట్ల రూపాయల పరిశీలనకు కంపెనీ ప్రతిపాదిస్తోంది అని పేర్కొంది. ఆ లెక్కల ప్రకారం బెంగళూరుకు చెందిన ఫర్నిచర్‌ రెంటల్‌ స్టార్టప్‌ విలువ రూ.857 కోట్లు. బెంగళూరు, ముంబై మరియు ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లోని కీలక మార్కెట్‌లలో గుర్తింపు కలిగిన ఫుర్లెన్‌కోను కొనుగోలు చేయడం ద్వారా కంపెనీ ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండెడ్‌ ఫర్నిచర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుందని షీలా ఫోమ్‌ చెప్పారు. ఇదే సమయంలో షీలా ఫోమ్‌ పూర్తి పోర్ట్‌ఫోలియో కంపెనీగా అవతరిస్తుంది. షీలా ఫోమ్, ఫర్లెంకోతో పాటు, ఇప్పుడు ఫర్నిచర్‌ కోసం రిఫర్బిష్‌మెంట్‌ను సర్వీస్‌గా అందించనున్నట్లు కంపెనీలు తెలిపాయి.

విదేశీ కంపెనీల్లో వాటా..
ఎస్‌ఎఫ్‌ఎల్‌ సముపార్జనల ట్రాక్‌ రికార్డ్‌ను కలిగి ఉంది. ఇది 2003లో ఐదు తయారీ ప్లాంట్‌లతో ఆస్ట్రేలియాలోని జాయిస్‌ ఫోమ్‌ను కొనుగోలు చేసింది మరియు 2019లో స్పెయిన్‌ ఆధారిత కంఫర్ట్‌ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేసింది. కంపెనీ ప్రకారం 13 బిలియన్‌ డాలర్ల పరిమాణంలో అంచనా వేయబడింది.
2012లో ఫుర్లెన్‌కో స్థాపన..
ఫుర్లెన్‌కో ఫర్నిచర్‌ 2012లో స్థాపించబడింది. కొన్ని సంవత్సరాలుగా దాని ఆదాయాలలో పెరుగుదలను నమోదు చేసింది. ఎఫ్‌వై21లో, దాని టాప్‌లైన్‌ రూ. 84 కోట్లు, ఎఫ్‌వై22లో రూ. 129 కోట్లు మరియు ఎఫ్‌వై23లో రూ. 152 కోట్లు వచ్చిందిజ అయితే కంపెనీ ఇప్పటికీ నష్టాల్లోనే ఉంది.

నంబర్‌ వన్‌గా..
స్లీప్‌వెల్‌ స్పాంజ్‌ పరుపులకు, కర్లాన్‌ కొబ్బరి పరుపులకు ప్రసిద్ధి చెందింది. వ్యాపారపరంగా, ఇది మంచి కొనుగోలు.
సండే బ్రాండ్‌ మ్యాట్రెస్‌ల తర్వాత స్లీప్‌వెల్‌ దేశంలో రెండవ అతిపెద్ద మ్యాట్రెస్‌ బ్రాండ్‌. కర్లాన్‌ మూడవ అతిపెద్దది. నంబర్‌ 2, 3 కంపెనీలు విలీనమైతే ఇదే నంబర్‌ వన్‌ అవుతుంది.

వినియోగదారులపై భారం..
పెద్ద సంస్థగా అవతరించిన తర్వాత దేశీయ మార్కెట్‌ను శాసించే అవకాశం ఉంది. ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిగతా చిన్న కంపెనీలు కూడా దీనినే ఫాలో అవుతాయి. దీంతో సామాన్యులపై భారం పడుతుంది. మ్యాట్రిస్‌లకు మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Share the post

Sleepwell- Karlon: ఇక ఆ ప్రఖ్యాత పరుపులు కనిపించవు.. భారీ డీల్ కు అమ్మకం

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×