Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

SIIMA: “సైమా ” అవార్డుల ప్రకటన వచ్చేసింది.. ఈసారి ఎక్కడ నిర్వహిస్తారంటే..

SIIMA: సినిమా పరిశ్రమకు సంబంధించి చాలా సంస్థలు పురస్కారాలు అందజేస్తాయి. అందులో ప్రత్యేకమైనది సైమా అవార్డు. స్థూలంగా చెప్పాలంటే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు. ఈ అవార్డుల విషయంలో సినిమా తారలు ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఈ సంస్థ గత కొంతకాలంగా సినిమా రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి, బహుళ ప్రజాదరణ పొందిన చిత్రాలకు పురస్కారాలు అందజేస్తూ ఉంటుంది. కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ప్రతి యేటా వేడుకలను అంబరాన్ని అంటే విధంగా చేస్తుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలు అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన చిత్రాలు, ఆ చిత్రాలకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక బృందానికి ఈ సంస్థ పురస్కారాలు అందజేస్తూ ఉంటుంది. కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఈ సంస్థ అవార్డులు అందజేస్తూ ఉంటుంది. ఈ సంస్థ ప్రకటించే అవార్డుల ప్రకటన కోసం సినీ తారలు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాదికి సంబంధించి సైమా నుంచి ప్రకటన వెలువడింది.

సైమా సంస్థ సినీ తారలకు అందించే అవార్డుల విషయంలో ఏ మాత్రం రాజీపడదు. అత్యంత వైభవంగా ఈ వేడుక నిర్వహిస్తూ ఉంటుంది. పైగా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా భాగస్వములుగా ఉండడంతో ఆకాశమే హద్దుగా ఈ అవార్డుల పురస్కార వేడుకలు జరుగుతూ ఉంటాయి. పెద్దపెద్ద నటి నటులు, లబ్ద ప్రతిష్టులైన సాంకేతిక నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. పురస్కారాల ప్రధాన ఉత్సవం అంటే ఆషామాషీగా కాకుండా ఆట_పాట_ మాట కలబోతలతో సైమా సంస్థ ఈ పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహిస్తూ ఉంటుంది.

దక్షిణాది సినీ రంగానికి చెందిన వారిని ప్రోత్సహించేందుకు దశాబ్దం క్రితం సైమా సంస్థ పురుడు పోసుకుంది. 11 సంవత్సరాలుగా ఈ సంస్థ విజయవంతంగా అవార్డులను అందజేస్తుంది. అయితే 2023 కు సంబంధించి సైమా వేడుకలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 15, 16 తేదీలలో ఈ వేడుకలు నిర్వహించినట్టు సైమా చైర్పర్సన్ బృందాప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు దుబాయ్ వేదిక కానుందని ఆమె వివరించారు. వేడుకలకు స్పాన్సర్ గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా వ్యవహరిస్తుందని ఆమె ప్రకటించారు. ఇక టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతారామం సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్ కూడా ఈ విలేకరుల సమావేశంలో కనిపించింది. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ ఈ వేడుకల్లో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని ప్రకటించారు. మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ దక్షిణాది సినిమా సీతారామం తాను గుర్తింపు పొందానని ఆమె ప్రకటించారు. తొలి చిత్రంతోనే సైమా లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుల పురస్కారంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని ప్రకటించారు. దుబాయ్ లోని డబ్ల్యూటీసీలో ఈ వేడుక జరుగుతుందని, ఆ వేదిక మీద తాను ప్రదర్శన ఇచ్చేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ఆమె ప్రకటించింది. అయితే ఈసారి హోస్టులుగా రాణా, మృణాల్ వ్యవహరించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

Share the post

SIIMA: “సైమా ” అవార్డుల ప్రకటన వచ్చేసింది.. ఈసారి ఎక్కడ నిర్వహిస్తారంటే..

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×