Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కు పేరు ఎవరు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్

Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలనాటి నందమూరి తారకరామారావు తరువాత ఆయన వారసులు ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చి సినిమాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు స్టార్ హీరోలుగా సినిమాల్లో కొనసాగుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల వరల్డ్ లెవల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ తీస్తున్న ‘దేవర’సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్ బయటకు వచ్చి సందడి చేస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి ఓ ఆసక్తికర విషయం హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. అదేంటంటే?

సీనియర్ ఎన్టీఆర్ తరువాత ఆయన పేరును ఎవరూ నేరుగా పెట్టుకోలేకపోయారు. ఆయన కుమారులు కృష్ణ పేరు ఉండేలా సెట్ చేశారు. కూతుళ్లకు ఈశ్వరి వచ్చేలా పేర్లు పెట్టారు. ఆ తరువాత వారి వారసులకు పేర్లు వేరే నిర్ణయించారు. అయితే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణ సినిమాల్లో కొనసాగినందున ఆయన కుమారుల పేర్లు బయటికి వచ్చాయి. ఆయనకు జూనియర్ ఎన్టీఆర్ తో కలిపి మొత్తం ముగ్గురు కుమారులు అన్న విషయం తెలిసిందే. వీరిలో ఒకరు జానకి రామ్, కళ్యాణ్ రామ్ కాగా.. జూనియర్ ఎన్టీఆర్ కు ముందుగా తారక రామ్ అని పెట్టారట.

ఓసారి ఎన్టీఆర్ హరికృష్ణ ను పిలిచి తన కుమారులను రమ్మన్నాడు. తన కుమారుల పేర్లు చెప్పమని అడిగారట. దీంతో హరికృష్ణ వారి పేర్లను చెప్పాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పేరును తారక రామ్ అని చెప్పగానే సీనియర్ ఎన్టీఆర్ ఆశ్చర్యపోయాడట. అయితే ‘ఇక నుంచి వీడి పేరు తారక రామ కాదు.. నందమూరి తారకరామారావు అని పిలవాలి’ అని సీనియర్ ఎన్టీఆర్ చెప్పాడట. దీంతో అప్పటి నుంచి జూనియర్ కు ఎన్టీఆర్ అని పేరు పెట్టాడట.

అలా సీనియర్ ఎన్టీఆర్ తన పేరును జూనియర్ కు ఆయనే పెట్టారని హరికృష్ణ ఓ సందర్భంలో చెప్పాడు. ఈ వీడియో చాన్నాళ్లకు బయటకొచ్చింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. అయితే హరికృష్ణ ప్రస్తుతం మన మధ్య లేకున్నా ఆయన చెప్పిన వ్యాఖ్యలను చూసి చాలా మంది నందమూరి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో హరికృష్ణ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మీరే స్వయంగా చూడండి..

Share the post

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కు పేరు ఎవరు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×