Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Athadu Movie Brahmanandam Son: ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన ఈ బుడ్డోడు గుర్తు ఉన్నాడా..? ఇప్పుడు ఎంత స్టైలిష్ గా తయారయ్యాడో మీరే చూడండి!

Athadu Movie Brahmanandam Son: మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ‘అతడు’. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది కానీ, టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఇది ఒక బాహుబలి రేంజ్ అని చెప్పొచ్చు. ఎన్ని సార్లు టెలికాస్ట్ చేసిన కూడా, ఆడియన్స్ ఈ సినిమా కోసం పనులన్నీ మానుకొని మరీ చూస్తుంటారు. అదేమరి త్రివిక్రమ్ మ్యాజిక్ అంటే, ఆయన సినిమాలు చాలా సింపుల్ గా అనిపిస్తాయి కానీ, పదేపదే చూడాలని కూడా అనిపిస్తుంది.

ఈ సినిమాలో మహేష్ బాబు సైలెంట్ యాక్టింగ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ సినిమాలో త్రిష ఇంటికి మహేష్ బాబు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లల గ్యాంగ్ ఉంటుంది. అందులో ఒక బుడ్డోడు ఇప్పుడు పెరిగి పెద్దవాడు అయ్యి హీరో గా కూడా మారిపోయాడు, అతడు ఎవరో ఒకసారి చూద్దాం.

ఈ సినిమా లో ఆ బుడ్డోడు బ్రహ్మానందం కొడుకుగా కనిపిస్తాడు. ఊరి నుండి ఇంటికి రాగానే ‘నాన్న నా కోసం రైలు ని తీసుకొచ్చావా’ అని అడగగానే ‘తీసుకొచ్చాను రా, వెళ్లి ఫ్లాట్ ఫారమ్ మీద ఉంది తెచ్చుకో పో’ అంటాడు.అప్పుడు ఆ బుడ్డోడు ‘సరే నాన్న’ అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆ బుడ్డోడి పేరు దీపక్ సరోజ్. ఈ సినిమా తర్వాత అతడు చైల్డ్ ఆర్టిస్టుగా ఆర్య , పెదబాబు , ఆంధ్రుడు , భద్ర మరియు లెజెండ్ వంటి చిత్రాల్లో నటించాడు.

ఇక 2014 వ సంవత్సరం లో దీపక్ ప్రధాన పాత్రలో నటించిన ‘మిణుగురు’ అనే సినిమాలో అద్భుతమైన నటన కనబర్చి నేషనల్ అవార్డు ని కూడా అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన హీరో గా ‘వందనం’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన సిద్దార్థ్ రాయ్ అనే సినిమాతో మోస్ట్ స్టైలిష్ లుక్ తో మన ముందుకు రాబోతున్నాడు. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని మీరు కూడా ఒకసారి చూసేయండి.

Share the post

Athadu Movie Brahmanandam Son: ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన ఈ బుడ్డోడు గుర్తు ఉన్నాడా..? ఇప్పుడు ఎంత స్టైలిష్ గా తయారయ్యాడో మీరే చూడండి!

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×