Ee Nagaraniki Emaindi Re Release: ఆరోజుల్లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి, తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం. ఈ చిత్రం ద్వారానే విశ్వక్ సేన్ లాంటి టాలెంటెడ్ హీరో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ చిత్రం లోని డైలాగ్స్, సన్నివేశాలు ఇలా అన్నీ కూడా మన కాలేజీ డేస్ ని మరియు మన రియల్ లైఫ్ లవ్ స్టోరీస్ ని గుర్తు చేస్తుంది.
Related Articles
థియేటర్స్ లో విడుదలైనప్పుడు ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఓటీటీ లోకి వచ్చిన తర్వాత అంతకంటే పెద్ద హిట్ అయ్యింది. బోర్ కొట్టినప్పుడల్లా ఈ సినిమాని చూసి కాలక్షేపం చేస్తుంటారు యూత్. అలాంటి సినిమా నేడు గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యింది, మొదటి రోజు ఓపెనింగ్స్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో వచ్చాయి. ఈ స్థాయి ఓపెనింగ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా చలామణి అయ్యే ఎంతో మందికి కూడా రీ రిలీజ్ అప్పుడు దక్కలేదు.
అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు కేవలం నైజాం ప్రాంతం నుండే 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. బక్రీద్ పండుగ రోజు విడుదల కావడం తో పాటుగా యూత్ లో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉండడం వల్ల ఈ స్థాయి ఓపెనింగ్స్ దక్కాయని అంటున్నారు. మొత్తం మీద అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా సుమారుగా కోటి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించిందని అంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ సినిమాని రీ రిలీజ్ చేస్తే దానికి కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆ సినిమా రికార్డు ని ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఇంత తేలికగా బ్రేక్ చేస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. చూడాలి మరి ఇదే రేంజ్ జోరుని రాబొయ్యే రోజుల్లో కూడా ఈ చిత్రం చూపిస్తుందో లేదో అనేది.
This post first appeared on ‘మహేషà±, à°ªà±à°°à°à°¾à°¸à±, à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à±, బనà±à°¨à±€â€™à°²à°•à± à°’à°• à°šà°¿à°¨à±à°¨ హీరోకి ఉనà±à°¨ ధైరà±à°¯à°‚ కూడా లేదా ?, please read the originial post: here