Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Vijayawada Kanaka Durga Temple: టెంకాయ కొట్టాలన్న కష్టమే ఇక్కడ..

Vijayawada Kanaka Durga Temple: ప్రభుత్వ శాఖలో ఏదైనా పని కావాలంటే లంచం మొట్టచెప్పాల్సిందేనన్న ఆరోపణ మొన్నటి వరకు ఉండేది. రెవెన్యూ వ్యవస్థలోనే కాకుండా ప్రతి చోటా ఏ పని కావాలన్న ఎంతో కొంత ఇవ్వాల్సిన పరిస్థితి. లంచం తీసుకునేవారి గురించి కొన్ని సినిమాలు వచ్చినా.. ఇతర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నా కొందరు అధికారులు, సిబ్బంది పనితీరు మారడం లేదు. ఓ వైపు యాంటి కరప్షన్ బ్యూరో(ఏసీబీ)వాళ్లు రైడ్స్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే చివరికి దేవాలయాల్లోనూ లంచం లేనిదే పనిచేయమని సిబ్బంది చెబుతుండడంతో భక్తులు ఆందోళన చేస్తున్నారు. ఏపీలోని విజయవాడ కనకదుర్గ ఆలయంలో కొబ్బరికాయ కొట్టేందుకు రూ.20 వసూలు చేయడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.

తమ కష్టాలు, బాధలు తీర్చమని అడిగేందుకు ఎంతో భక్తితో ప్రజలు దేవాలయానికి వస్తారు. నిత్యం రోజూవారి కార్యక్రమాలతో బిజీగా ఉండే వీరు ఆలయానికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇక్కడ ప్రతీ చోట పైసల్ వసూలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలోకి వచ్చే భక్తలు అమ్మవారిని దర్శనం చేసుకున్న తరువాత టెంకాయను పగలగొడుతారు. అయితే భక్తులను ఆ టెంకాయను కొట్టనీయకుండా అక్కడున్న సిబ్బంది లాక్కుంటారు. వారే దానిని కొట్టి.. ఆ తరువాత రూ.20 వసూలు చేస్తున్నారు.

రూ.20 ఇవ్వని వారిపై సిబ్బంది ఎదురుదాడికి దిగుతున్నారు. పైసలు ఇవ్వకుండా కొబ్బరికాయను కొట్టనిచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా ఇలా డబ్బులు వసూలు చేయడానికి తాము టెండర్లు పాడుకున్నామని, ఎవరి చెబుతారో చెప్పుకోవమని బెదిరిస్తున్నారు. దీంతో భక్తులు వారితో గొడవ ఎందుకని రూ.20 ఇస్తన్నారు. మరికొందరు మాత్రం సిబ్బందితో వాదనకు దిగడంతో ప్రశాంతంగా ఉండాల్సిన ఆలయం స్వల్ప ఉద్రిక్తంగా మారుతోంది.

సిబ్బంది ఇంత దర్జాగా వసూలు చేస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. కొందరు అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అంటున్నారే తప్ప ఈ వసూళ్లను ఆపడం లేదు. పైగా ఇలా వసూలు చేసే టెండర్ ను వారానికి రూ.లక్షా 8వేల రూపాయలకు పాడుకున్నట్లు ఆ సిబ్బంది చెప్పడంతో భక్తులు మరింత కోపోద్రిక్తులవుతున్నారు.

Share the post

Vijayawada Kanaka Durga Temple: టెంకాయ కొట్టాలన్న కష్టమే ఇక్కడ..

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×