Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Deepinder Goyal: అప్పుడు 8వ తరగతి ఫెయిల్ అయ్యాడు.. ఇప్పుడు రోజుకు కోటి సంపాదిస్తున్నాడు.. ఈయన సీక్రెట్ ఇదే

Deepinder Goyal: చదువు జీవితాన్ని మార్చేస్తుంది… అని ఓ సినిమాలో హీరోయిన్ పదే పదే చెబుతుంది.. అలాగే చిన్నగా ఉన్నప్పుడు మనం ఎంత ఏడ్చినా సరే.. తల్లిదండ్రులు బలవంతంగానైనా బడికి పంపి చదువుకోవాలి నాన్న.. అంటూ పాఠశాలల్లో వేస్తారు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంత కర్కోటంగా ప్రవర్తించడం దేనికి? అన్న ప్రశ్న కనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులు అలా ఎందుకు చేశారో… తరువాతి జీవితంలో కనిపిస్తుంది. చదువు జీవితాన్ని కచ్చితంగా మారుస్తుంది.. ఉన్నత స్థితికి చేరుస్తుంది.. అవసరమైతే ప్రపంచ విజేతను చేస్తుంది.. కానీ అలాంటి చదువును అందరూ చిన్నప్పటి నుంచి సాఫీగా చదువరు. తడబకుండా కొనసాగిస్తారు. అయినా కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తేనే జీవితంలో సక్సెస్ అనేది ఉంటుందని నిరూపించాడు ఓ యువకుడు..

తాను 8వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. సాధారణంగా బోర్డ్ ఎగ్జామ్స్ లో తప్పుతారు. కానీ 8వ తరగతి కూడా పాస్ కానీ నువ్వెందుకు? అని కొందరు హేళన చేశారు. ఈ హేళనను ఆయన అవమానంగా ఫీలవలేదు. ఇదే తన జీవితానికి దారి చూపాయి. అవమానాలను పట్టుదలగా చేసుకొని ముందుకు వెళ్లి చదువుకుంటూ పోయాడు. అలా ఇంటర్ పూర్తి చేసిన యువకుడికి మళ్లీ నిరాశే. ఐఐటీలో సీటు కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక్కడా తీవ్రంగా కృషి చేసి.. చివరికి ఎలాగోలా పూర్తి చేశాడు. అయితే చదువుకోవడం వల్ల అతనికి లోకం తెలిసింది. ఆ తరువాత తన స్నేహితుడితో కలిసి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు.. ఇద్దరూ కలిసి ఓ వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.. అదే ‘జొమాటో’..

‘జొమాటో’.. పట్టణాలు, నగరాలకు పరిచయం లేని ఈ సంస్థను స్థాపించింది దీపిందర్ గోయల్. పంజాబ్ లోని ముక్త్ సర్ జిల్లాలో జన్మించిన ఈయన జీవిత గాథ యువకులకు ఆదర్శం. నేటి యువత చిన్న చిన్న సమస్యలకు పెద్దగా హైరానా పడిపోతుంటారు. గోయల్ పేద కుటుంబంలో జన్మించారు. ఆయన 8వ తరగతిలో ఫెయిల్ కావడంతో పట్టుదలతో చదివాడు. పదో తరగతిలో టాపర్లలో ఒకరయ్యారు. ఆ తరువాత ఐఐటీ ప్రవేశపరీక్ష సమయంలోనూ అనేక అవమానాలు పొందాడు. మొత్తానికి చంఢీఘర్ లో 2005లో మ్యాథమెటిక్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

ఈ సమయంలోనే తన స్నేహితుడు పంకజ్ చడ్డాతో కలిసి జొమాటోను స్థాపించారు. ఆ తరువాత అతనికి తిరుగులేకుండా పోయింది. 2021 ప్రకారం జొమాటో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. ఆ తరువాత దీపిందర్ గోయల్ నికర ఆదాయం విలువ రూ.5,345 కోట్లకు పెరిగింది. కరోనా సమయంలో జొమాటో డెలివరీ బాయ్స్ పిల్లల విద్య కోసం రూ.700 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే తన జీవితంలో చదువు ఎన్ని మలుపులు తిప్పిందో అర్థం చేసుకొని పేద పిల్లల చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు.

జీవితమంటే పూల పాన్పు కాదు. కష్టపడందే ఏదీ తన దగ్గరకు రాదు అని చెప్పడానికి గోయల్ నిదర్శనం. ప్రస్తుతం గోయల్ కంపెనీ నుంచి ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. కానీ ఏటా రూ.358 కోట్లు అందుకుంటున్నాడు. అంటే రోజుకు కోటిరూపాల ఆదాయం అన్నమాట. అయితే ఇంత సంపాదిస్తున్నా.. తాను గోప్ప వ్యక్తి అని ఎప్పుడూ ఫీల్ కాడు అవసరమైతే ఫుడ్ డెలివరీ చేయడానికి బైక్ వెళ్తుంటాడు. అలాంటి సింప్లిసిటీనే అతనిని ఈ స్థాయికి తీసుకొచ్చిందని అందరూ అనుకుంటున్నారు.

Share the post

Deepinder Goyal: అప్పుడు 8వ తరగతి ఫెయిల్ అయ్యాడు.. ఇప్పుడు రోజుకు కోటి సంపాదిస్తున్నాడు.. ఈయన సీక్రెట్ ఇదే

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×