Kalyan Dasari Marriage: స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. కుమారుడు కళ్యాణ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. మే 20న హైదరాబాద్ లో డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ వివాహం ఘనంగా జరగనుంది. కళ్యాణ్ పెళ్లాడబోయే అమ్మాయి పేరు సుమత అని తెలుస్తుంది. కళ్యాణ్ పెళ్లి వేడుకకు టాలీవుడ్ సెలెబ్స్ భారీగా హాజరుకానున్నారని సమాచారం. కళ్యాణ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. అధీరా టైటిల్ తో సూపర్ హీరో మూవీతో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.
Related Articles
అధీరా చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. గత ఏడాది రాజమౌళి, ఎన్టీఆర్ గెస్ట్స్ గా భారీగా అధీరా లాంచ్ చేశారు. ప్రస్తుతం అధీరా చిత్రీకరణ దశలో ఉన్నట్లు సమాచారం. మొదటి సినిమా విడుదల కాకుండానే కళ్యాణ్ పెళ్లి చేసుకోబోతున్నారు. అధీరా కాన్సెప్ట్ టీజర్ విడుదల చేయగా ఆకట్టుకుంది. తెలుగులో సూపర్ హీరో చిత్రాలు చాలా అరుదు. మరి ప్రశాంత్ వర్మ అధీరాతో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. ప్రస్తుతం ఆయన తేజా సజ్జా హీరోగా హనుమాన్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ నిర్మాతగా దానయ్య పేరు ప్రముఖంగా వినిపించింది. ఆర్ ఆర్ ఆర్ పలు గ్లోబల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఆర్ ఆర్ ఆర్ ప్రతిష్టాత్మక ఆస్కార్ సైతం కొల్లగొట్టింది. ఆస్కార్ వేడుకల్లో ఆర్ ఆర్ ఆర్ టీమ్ అందరూ పాల్గొన్నారు. నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది.
అయితే రాజమౌళి, ఎన్టీఆర్, కీరవాణి, రామ్ చరణ్ ఎక్కడా నిర్మాత దానయ్య పేరు ప్రస్తావించలేదు. ఆర్ ఆర్ ఆర్ ఈవెంట్ కి దానయ్య హాజరుకాలేదు. దీంతో రాజమౌళి-దానయ్య మధ్య విభేదాలు తలెత్తాయనే పుకార్లు వినిపించాయి. ఈ వార్తలపై దానయ్య స్పందించారు. నాకు పబ్లిసిటీ అంటే నచ్చదు. అందుకే ఆస్కార్ ఈవెంట్ కి దూరంగా ఉన్నాను. రాజమౌళితో నాకు ఎలాంటి గొడవలు లేవు అన్నారు. దానయ్య పేరున ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని చిరంజీవి నిర్మించారనే వాదనను కూడా కొట్టిపారేశారు.
This post first appeared on ‘మహేషà±, à°ªà±à°°à°à°¾à°¸à±, à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à±, బనà±à°¨à±€â€™à°²à°•à± à°’à°• à°šà°¿à°¨à±à°¨ హీరోకి ఉనà±à°¨ ధైరà±à°¯à°‚ కూడా లేదా ?, please read the originial post: here