Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

NTR Film Studio: హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ ‘ఫిలిం స్టూడియోస్’.. ప్రారంభ తేదీ కూడా ఫిక్స్!

NTR Film Studio: #RRR మూవీ తో గ్లోబల్ వైడ్ క్రేజ్ మరియు స్టార్ స్టేటస్ ని దక్కించుకొని ఫుల్ జోష్ మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రీసెంట్ గానే ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకొని రెండవ షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది.ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ బడా హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొత్త వ్యాపార రంగం లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు సినిమాలు మరియు బుల్లితెర మీద పలు షోస్ కి హోస్ట్ గా చేసిన జూనియర్ ఎన్టీఆర్ ,పలు యాడ్స్ లో కూడా నటించాడు. కానీ అల్లు అర్జున్ , రామ్ చరణ్ మరియు మహేష్ బాబు కి ఉన్నట్టుగా బయట వ్యాపారాలు ఎన్టీఆర్ కి లేవు.

అందుకే ఇప్పుడు ఆయన వ్యాపార రంగం లో కూడా చక్రం తిప్పేందుకు సిద్ధం అయ్యాడు.ఇండస్ట్రీ కి సంబంధించిన వివేక్ కూచి బోట్ల, నిర్మాత అభిషేక్ అగర్వాల్ మరియు తాహిర్ తో కలిసి ఎన్టీఆర్ త్వరలోనే ఒక ఫిల్మ్ స్టూడియో లో పెట్టుబడులు పెట్టబోతున్నాడట. ఇప్పటికే హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఈ స్టూడియో కి సంబంధించి 5 అంతస్తుల భవనం ని కూడా నిర్మించాడట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ స్టూడియో లోనే #NTR30 లేటెస్ట్ షెడ్యూల్ ని జరపబోతున్నారట.

ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన ఇద్దరి సోదరులతో కలిసి హైదరాబాద్ లో అల్లు స్టూడియోస్ ని స్థాపించారు.ఇందులో ఇప్పుడు సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయో లేవో తెలియదు కానీ, అత్యాధునిక టెక్నాలజీ తో మాత్రం ఈ స్టూడియో ని నిర్మించారని తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ స్టూడియోస్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Share the post

NTR Film Studio: హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ ‘ఫిలిం స్టూడియోస్’.. ప్రారంభ తేదీ కూడా ఫిక్స్!

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×