Sneha Ullal: స్నేహ ఉల్లాల్ ఒకప్పుడు కుర్ర హృదయాలను కొల్లగొట్టిన భామ. ఈమెకు జూనియర్ ఐశ్వర్య రాయ్ అనే పేరుండేది. కళ్ళు, ఫేస్ కట్ ఐశ్వర్య రాయ్ కి దగ్గరగా ఉంటాయి. దాంతో ఆమె జూనియర్ ఐశ్వర్య రాయ్ గా పాప్యులర్ అయ్యింది. స్నేహ ఉల్లాల్ ఆరంభం ఘనంగా జరిగింది. ఆమె డెబ్యూ మూవీ లక్కీ. ఈ చిత్ర హీరో సల్మాన్ ఖాన్ కావడం విశేషం. 2005లో లక్కీ విడుదలైంది. అనంతరం మరో రెండు హిందీ చిత్రాలు చేసింది. అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు.
Related Articles
ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. మంచు మనోజ్ హీరోగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ నేను మీకు తెలుసా? చిత్రంలో నటించింది. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. కింగ్ మూవీలో స్నేహ ఉల్లాల్ ఐటెం సాంగ్ చేయడం విశేషం.
2010 స్నేహ ఉల్లాల్ కి బాగా కలిసొచ్చింది. ఆమెకు వరుసగా రెండు హిట్స్ పడ్డాయి. అక్కినేని హీరో సుశాంత్ కి జంటగా నటించిన కరెంట్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలోని ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక స్నేహ ఉల్లాల్ జతకట్టిన స్టార్ హీరో బాలకృష్ణ . దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సింహ మూవీలో స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటించింది. సింహ మంచి విజయం సాధించింది.
సింహ వంటి కమర్షియల్ హిట్ తర్వాత స్నేహకు ఆఫర్స్ పెరుగుతాయి అనుకుంటే అలా జరగలేదు. ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఒక దశలో స్నేహ ఉల్లాల్ సీరియల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది. ఆమె ఆసుపత్రిలో లాంగ్ టైం ట్రీట్మెంట్ తీసుకుంది. ఒకప్పుడు సన్నగా నాజూగ్గా సన్నజాజి తీగలా ఉండే స్నేహ ఉల్లాల్ ఇప్పుడు బొద్దుగా తయారైంది. మునుపటి గ్లామర్ ఆమెలో లేదు. స్నేహ ఉల్లాల్ లేటెస్ట్ లుక్ చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
View this post on Instagram
This post first appeared on ‘మహేషà±, à°ªà±à°°à°à°¾à°¸à±, à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à±, బనà±à°¨à±€â€™à°²à°•à± à°’à°• à°šà°¿à°¨à±à°¨ హీరోకి ఉనà±à°¨ ధైరà±à°¯à°‚ కూడా లేదా ?, please read the originial post: here