Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Ghost Malls: అమ్మో ఘోస్ట్‌ మాల్స్‌… దేశంలో పెరుగుతున్న సంఖ్య

Ghost Malls: దేశ ప్రజల అభిరుచులు మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటి సరుకుల కోసం చిల్లర కొట్టుకు, కిరాణా షాపులకు వెళ్లేవారు. వాటి స్థానాల్లో చిన్నసైజు షాపింగ్‌ మాల్స్‌ వచ్చేశాయి. తర్వాత ఆన్‌లైన్‌ సేల్స్‌ పెరుగుతున్నాయి. బిజీలైఫ్‌ కారణంగా ఆన్‌లైన్‌ సాపింగ్‌కు ప్రాధానయం పెరగుతోంది. మరోవైపు పెద్దపెద్ద శాపింగ్‌ మాల్స్‌ రంగప్రవేశం చేస్తున్నాయి. దీంతో చిల్లర దుకాణాలు, కిరాణా షాపుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇక చిన్న షాపింగ్‌ మాల్స్‌ ఘోస్ట్‌ మాల్స్‌గా మారిపోతున్నాయి.

ఘోస్ట్‌ మాల్స్‌ అంటే..
పెరిగిన ఆన్‌లైన్‌ వ్యాపారాలతో చిన్న షాపింగ్‌ మాల్స్‌కు గిరాకీ తగ్గుతోంది. దీంతో అవి ఘోస్ట్‌ మాల్స్‌గా మారుతున్నాయి. సాధారణంగా అందుబాటులో మాల్‌ ప్రాపర్టీలో 40 శాతం ఖాళీగా ఉంటే వాటిని ఘోస్ట్‌ మాల్స్‌గా వ్యవహరిస్తారు. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇలాంటి మాల్స్‌ పెరుగుతున్నాయి. 2022లో వీటి సంఖ్య 57 ఉండగా, 2023 నాటికి 64కు పెరిగాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ప్రాంక్‌ ఇండియా పేర్కొంది. ఈమేరకు థింక్‌ ఇండియా థింక్‌ రిటైల్‌–2024 పేరిట ఓ నివేదిక విడుదల చేసింది. 29 నగరాల్లో 58 హైస్ట్రీట్స్, 340 షాపింగ్‌ మాల్స్‌ పరిశీలించాక నైట్‌ ప్రాంక్‌ ఈ నివేదిక రూపొందించింది. దేశవ్యాప్తంగా 64 ఘోస్ట్‌ మాల్స్‌ కారణంగా 13.3 మిలియన్‌ చదరపు అడుగుల లీజు స్థలం నిరుపయోగంగా మారిందని పేర్కొంది.

58 శాతం పెరుగుదల..
గతేడాదిలో పోలిస్తే దేశంలో నిరుపయోగ లీజు స్థలం 58 శాతం పెరిగినట్లు పేర్కొంది. దేశ రాజధాని డిల్లీలో అత్యధిక ఘోస్ట్‌ మాల్స్‌ ఉన్నాయని పేర్కొంది. తర్వాతి స్థానాల్లో ముంబయి, బెంగళూరు ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో మాత్రం 19 శాతం ఘోస్ట్‌ షాపింగ్‌ సెటర్లు తగ్గినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ట్రెండ్‌ను పరిశీలించినప్పుడు లక్ష చదరపు అడుగుల లీజు స్థలం కలిగిన చిన్న చిన్న మాల్స్‌ వేకెన్సీ రేటు 36 శాతం ఉండగా, 5 లక్షల కన్నా ఎక్కువ చదరపు అడుగులు కలిగిన పెద్ద మాల్స్‌ వేకెన్సీ రేటు 5 శాతం మాత్రమే అని వివరించింది. మిడ్‌ లెవల్‌ షాపింగ్‌ మాల్స్‌ వేకెన్సీ రేటు 15. 5శాతం ఉందని పేర్కొంది.

రిటైల్‌ సెక్టాకు రూ.6,700 కోట్ల నష్టం..
ఇక ఈ ఘోస్ట్‌ మాల్స్‌ కారణంగా రిటైల్‌ సెక్టార్‌కు రూ.6,700 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. చిన్న మాల్స్‌కు పెద్దగా ఆదరణ ఉండకపోవడంతో ప్రాపర్టీ యజమానులు నష్టపోతున్నారు అద్దెదారులను ఆకర్షించడంలో వారు విఫలమవుతున్నారని పేర్కొంది. గ్రేడ్‌ ఏ మాల్స్‌ వినియోగదారులతో కిటకిటలాడుతుండగా, గ్రేడ్‌ సీ మాల్స్‌ ఘోస్ట్‌ మాల్స్‌గా మారుతున్నాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బాలాజీ తెలిపారు.

Share the post

Ghost Malls: అమ్మో ఘోస్ట్‌ మాల్స్‌… దేశంలో పెరుగుతున్న సంఖ్య

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×