Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

JD Lakshminarayana: జెడి లక్ష్మీనారాయణ ప్రాణాలకు ముప్పు.. ఎవరి నుంచి అంటే?

JD Lakshminarayana: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్నారు. ఆయన విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన ఉత్తరాంధ్రలో కార్యక్రమాలు సాగించేవారు. అయితే ఉన్నట్టుండి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. గతంలో కీలక కేసులను దర్యాప్తు చేసిన అధికారిగా లక్ష్మీనారాయణ కు గుర్తింపు ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో ఆ కేసుల్లో నిందితుల నుంచి తనకు హాని ఉందని భావిస్తున్న లక్ష్మీనారాయణ ఏకంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం విశేషం.

ఇంటి పేరు కంటే.. సిబిఐ జేడీ గానే లక్ష్మీనారాయణ దేశవ్యాప్తంగా సుపరిచితం. మహారాష్ట్ర కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి ఈయన. డి ఐ జి హోదాలో ఉన్నప్పుడే కేంద్ర సర్వీసుల్లోకి డిప్యూటేషన్ పై వెళ్లారు. 2006లో హైదరాబాదులోనే విధుల్లో చేరారు. ఆ తరువాత సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కేసును విచారించారు. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ కేసులో జనార్ధన రెడ్డికి కూడా జైలుశిక్ష పడింది. అయితే ఈ ఒక్కకేసే కాదు. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ అధికారి కూడా లక్ష్మీనారాయణే.

గత ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు లక్ష్మీనారాయణ. జనసేనలో చేరి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు. ఎన్నికల అనంతరం జనసేన పార్టీని వీడారు. గత ఐదు సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. ప్రధాన పార్టీల్లో ఏదో ఒక దాని నుంచి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే రాజకీయ పార్టీల నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో.. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రార్థించారు.

విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు లక్ష్మీనారాయణ. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్ధన రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని లక్ష్మీనారాయణ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం తన ఎన్నికల ప్రచార సభల్లో కర్ణాటక మనుషులు ఎక్కువగా కనిపిస్తున్నారని.. తన ప్రాణానికి ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముంగిట ఇదో సంచలనంగా మారింది.

Share the post

JD Lakshminarayana: జెడి లక్ష్మీనారాయణ ప్రాణాలకు ముప్పు.. ఎవరి నుంచి అంటే?

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×