Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

KCR Interview: కేసీఆర్ మళ్లీ సీఎం కాగలడా?

KCR Interview: తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ అధినేత, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అకాశం ఉందా.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో పార్టీని మళ్లీ గెలిపించగలుగుతాడా అంటే.. అవుననే అంటున్నారు కేసీఆర్‌. సార్వత్రిక ఎన్నికల వేళ టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా..
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీనే అని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మళ్లీ పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌పై నాలుగు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఆ పార్టీని గెలిపించి తప్పు చేశామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లోనే ఇది స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు.

కేసీఆర్‌కు ఛాన్స్‌ ఉందా..?
ఇంటర్వ్యూలో కేసీఆర్‌ మాటలు ఎలా ఉన్నా.. ప్రస్తుత పరిస్థితిలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవడమే కష్టమన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో పార్టీని గెలిపించి మళ్లీ అధికారంలోకి చావడం అంటే అంత ఈజీ కాదన్న అంటున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌ వ్యతిరేకులంతా బయటకు వస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబంలో కూడా గొడవలు ఉన్నాయి. సీఎం పీటం కోసం కవిత, కేటీఆర్, హరీశ్‌రావు మధ్య అంతర్యుద్ధం జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ పరిస్థితిలో ఒకవేళ మళ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిచినా.. కేసీఆర్‌ను సీఎం అయ్యే అవకాశం ఇస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్‌ సీఎం పీటంపై కన్నేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిస్తే ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరిగింది. ఆ పార్టీ నేతలు కూడా చాలా సందర్భాల్లో ప్రకటించారు. ఓటమి తర్వాత కేసీఆర్‌ కుటుంబంలో గొడవలు పెరిగాయన్న అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితిలో కేసీఆర్‌ కేవలం పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని అంచనా వేస్తున్నారు.

Share the post

KCR Interview: కేసీఆర్ మళ్లీ సీఎం కాగలడా?

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×